తయారీ, మౌలిక రంగాలకు పెద్దపీట

November 05
09:34 2017

న్యూఢిల్లీ: దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కాగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్షను కనబరిచారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన సులభతర వ్యాపార నిర్వహణ దేశాల జాబితాలో భారత్ స్థానం గణనీయంగా మెరుగుపడినది తెలిసిందే. నిరుడుతో పోల్చితే ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 130 నుంచి 100కు చేరింది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో మున్ముందు భారత్ స్థానం మరింత ముందుకు వెళ్తున్నదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేసిన విమర్శలపై స్పందిస్తూ గతంలో ప్రపంచ బ్యాంకుతో పనిచేసినవారు తాజా ర్యాంకులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ చురకలు వేశారు.

శనివారం ఇక్కడి ప్రవాసి భారతీయ కేంద్రంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారతీయ వ్యాపార సంస్కరణలుపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదీ విచ్చేశారు. ఇందులో కేంద్ర మంత్రులతోపాటు సీఐఐ, ఫిక్కీ తదితర వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ పెట్టుబడులకు నిలయమన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు ఇతర అన్ని సంస్కరణలు ప్రభావం చూపినప్పుడు భారత్ ర్యాంకు మరింతగా పెరుగుతుందన్నారు. గతేడాది మే వరకు తెచ్చిన సంస్కరణల ప్రభావమే తాజా ర్యాంకులపై ఉందన్నారు. జీఎస్టీ ఫలాలు అందినప్పుడు ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

Related Articles

తాజా వార్తలు

సంపాదకీయం

No posts where found

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'