వర్చువల్ కరెన్సీలు మోసపూరిత స్కీమ్‌లు

December 30
12:26 2017

న్యూ డిల్లీ  : బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు రోజు రోజుకూ దూసుకెళ్లుతున్నాయి. ఆన్‌లైన్ ట్రేడింగ్ మార్కెట్‌లో డిజిటల్ కరెన్సీలు సృష్టిస్తున్న ప్రకంపనలపై ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. వర్చువల్ కరెన్సీలు మోసపూరిత స్కీమ్‌లని ఆర్థిక శాఖ హెచ్చరించింది. కస్టమర్ల అలాంటి స్కీమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్చువల్ కరెన్సీలు ఇటీవల అనూహ్య రీతిలో దూసుకువెళ్తున్నాయని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ బిట్‌కాయిన్ శరవేగంగా పరుగెడుతున్నదని, వర్చువల్ కరెన్సీలకు స్వాభావికమైన విలువ లేదని, వాటికి ఎటువంటి బ్యాకప్ కూడా ఉండదని ఆర్థికశాఖ పేర్కొన్నది. బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలు దూసుకెళ్లుతున్న తీరు కేవలం ఊహాజనితం మాత్రమే అని ప్రభుత్వం తెలిపింది. బిట్‌కాయిన్ బుడగ ఒక్కసారిగా పేలుతుందని, దాని వల్ల ఇన్వెస్టర్లు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. మరీ ముఖ్యంగా రిటేల్ కస్టమర్లు తమ సంపాదనను కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. ఇలాంటి పాంజీ స్కీమ్‌ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వాటి ఉచ్చులో పడరాదని హెచ్చరించింది

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'