టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జీఈ ఏవియేషన్ జాయింట్ వెంచర్

December 15
08:51 2017

హైదరాబాద్: పెట్టుబడులకు చిరునామాగా మారిన హైదరాబాద్ పారిక్షిశామికవూపగతిలో మరో కలికితురాయి చేరింది. నగర శివారు ఆదిభట్లలో వైమానిక ఇంజిన్ల విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. దాదాపు 3వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విమానాల విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు దేశీయకంపెనీ టాటా గ్రూపు, అమెరికా కార్పొరేట్ దిగ్గజం జీఈ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న లీప్ విమాన ఇంజిన్ల విడిభాగాలను భారత్‌లో తయారుచేసేందుకు దేశీయ సంస్థ టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్, అమెరికా కార్పొరేట్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) చైర్మన్ జాన్ ఎల్ ఫ్లానరీ గురువారం ముంబైలో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

లని భావిస్తున్నట్టు రెండు సంస్థలూ ప్రకటించాయి. రెండు కంపెనీలు తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నాయి. టాటా గ్రూపులోని ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జీఈ ఏవియేషన్ ఈ జాయింట్ వెంచర్‌ను చేపడుతాయి. దేశంలో విమాన ఇంజిన్ల తయారీ, వాటి నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా పటిష్ఠమైన వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు రెండు సంస్థలు కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సపూన్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి. 2016 అక్టోబర్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం అమెరికాలో పర్యటించిన సందర్భంగా షికాగోలో జీఈ చైర్మన్‌తో భేటీ అయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ కంపెనీని తెలంగాణ ప్రభుత్వం కోరుతూవస్తున్నది. బుధవారం ఢిల్లీలో మరోసారి సంస్థ చైర్మన్‌తో కేటీఆర్ సమావేశమైన విషయం తెల్సిందే. ఈ సందర్భంగానే నేడో రేపో కీలక ప్రకటన వెలువడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. దానిని నిజం చేస్తూ గురువారం రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'