సోనియా ముద్ర

December 15
15:30 2017

తెలంగాణ ప్రజల ఆకాంక్షను కూడా సోనియా అర్థం చేసుకున్నారనే భావన ఇక్కడి ప్రజలకు ఉన్నది. కానీ 2004లో అధికారానికి వచ్చిన వెంటనే, లేదా కేసీఆర్ నిరాహార దీక్ష పట్టినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవలసింది. కానీ సుదీర్ఘ పోరాటం చేయవలసి రావడంతో, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు.

కాంగ్రెస్ పార్టీకి పందొమ్మిదేండ్లు సారథ్యం వహించిన సోనియా గాంధీ- తనయుడు రాహు ల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి స్వీకరిస్తున్న నేపథ్యంలో- ఇక వైదొలుగడమే తన పని అని చెప్పా రు. సోనియా వైదొలుగుతున్నారనే మాట సంచలన వార్తగా మారిపోయింది. కానీ ఆ వెంటనే సోనియా పార్టీ పగ్గాలు వీడుతున్నారే తప్ప, క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించడం లేదనే వివరణ పార్టీ వర్గాల నుంచి వెలువడింది. స్వాంతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూతో సహా అనేకమంది అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. భారత గణతంత్రం అవతరించిన తర్వాత మాత్రం క్రమంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం చేతిలోకి పోయిందనేది వాస్తవం. ప్రధాని ఇందిరా గాంధీ కోడలుగా, ప్రధా ని రాజీవ్ గాంధీ భార్యగా ఆమె రాజకీయాల్లో తలదూర్చకుండా తన పరిధిలోనే ఉండేవారు. కానీ రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత సోనియా రాజకీయ ప్రవేశానికి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ, ఆమె అనాసక్తి ప్రదర్శించారు. కానీ ఆమె ఎంతోకాలం ఆ నిర్లిప్తతతో లేరు. కాంగ్రెస్ పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించి, అంతిమంగా రాహుల్‌గాంధీకి పట్టంకట్టే వరకు తాను అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. పందొమ్మిదేండ్ల కిందట ఈ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యత లు స్వీకరించినప్పుడు సోనియా ఇంతకాలం కొనసాగుతానని ఊహించారా అనేది సందేహమే. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు కొరవడటంతో సోనియాపై నాయకత్వ భారం కొనసాగింది. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ రాజకీయాలకు కొంత అలవాటు పడినట్టు కనిపిస్తున్నారు.

ఏడు పదుల వయసు దాటిన సోనియా మొదట్లో ఉన్నంత ఆరోగ్యంగా లేరు.
రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను శనివారం స్వీకరిస్తున్న నేపథ్యంలో సోనియా తాను వైదొలుగుతున్న సూచనలిచ్చారు. కానీ సోనియా క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతారనేది రాజకీయ పరిశీలకులు నమ్మలేకపోతున్నారు. దీనికి కారణం రాహుల్ గాంధీ ఇంకా సోని యా సలహాలు, సూచనలు లేకుండా నెట్టుకురాగలుగుతారనే నమ్మకం లేకపోవడం వల్లనే. సోని యా ఇప్పటికీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఉన్నారు. రాజకీయాల్లో రాహుల్ ఇప్పటికీ పట్టు చిక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టాలం టే, ఇతర పక్షాలతో సంప్రదింపులు జరిపే ఉన్నత స్థాయి సోనియాకు ఉన్నదే తప్ప రాహుల్‌కు కానీ, మరే సీనియర్ పార్టీ నేతకు కానీ లేదు. సోనియా ఈ స్థాయిని సాధించుకోవడం వెనుక ఆమె సాగించిన కృషి ఉన్నది. రాజీవ్ హత్య జరిగిన తర్వాత మూడేండ్లకు సోనియా పార్టీ నాయకత్వ బాధ్యత లు స్వీకరించినప్పటికీ, అది అంత సులభంగా సాధ్యపడలేదు. రాజీవ్ హతులైన వెంటనే ఆమె నాయకత్వానికి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ, ఆ తర్వాత మూడేండ్లలో పరిస్థితి మారిపోయింది. పీవీ వంటి రాజకీయ ఉద్ధండుడు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా ప్రభావం నిర్వీర్యం కావడం మొదలైంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీది, చివరికి పార్టీ నాయకత్వాన్ని దక్కించుకున్నారు. 1999 లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత, కార్యకర్తలకు పార్టీ భవిష్యత్తు పట్ల ఆశలు సన్నగిల్లాయి. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీని 2004లో గెలిపించారు. దశాబ్దం పాటు మళ్ళా కాం గ్రెస్ పాలన సాగిందంటే సోనియా రాజకీయ చతురతే కారణం. అధికారంలో ఉన్నా, లేకున్నా కాంగ్రెస్‌తో పాటు, లౌకిక పక్ష రాజకీయాలకు సోనియా కేంద్ర బిందువు కాగలిగారు.

సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న దాదాపు రెండు దశాబ్దాల కాలంలో పార్టీలో నూ, ప్రభుత్వంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. యూరోపియన్ ఉదారవాద ప్రజాస్వా మ్య భావనల ప్రభావం సోనియాపై ఉండి ఉంటుంది. రాష్ర్టాల ముఖ్యమంత్రులను పూర్తికాలం కొనసాగనిచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ, జాతీయ సలహా మండలి ద్వారా అనేక ప్రగతిశీల చట్టాలు చేయించగలిగారు. జాతీయ ఉపాధి పథకం, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత, సామాజిక భద్రత మొదలైన చట్టాలు చేయడం వెనుక సోనియా ప్రోద్బ లం ఉన్నదనవచ్చు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కూడా సోనియా అర్థం చేసుకున్నారనే భావన ఇక్కడి ప్రజలకు ఉన్నది. కానీ 2004లో అధికారానికి వచ్చిన వెంటనే, లేదా కేసీఆర్ నిరాహార దీక్ష పట్టినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవలసింది. కానీ సుదీర్ఘ పోరాటం చేయవల సి రావడంతో, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. సోనియా గత నాలుగైదేండ్లుగా అనారో గ్యం మూలంగా అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. రాహుల్‌కు నాయకత్వం అప్పగించినప్పటికీ, పార్టీ అనేక బలహీనతలతో కొట్టుమిట్టాడుతున్నది. కేంద్ర నాయకత్వం ఇప్పటి కీ కోటరీ రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతున్నది. రాష్ర్టాల శాఖలు జవసత్వాలను కోల్పోయాయి. ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. పార్టీని చక్కదిద్దే పరిణతి రాహుల్‌లో కనిపించడం లే దు. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి మరెవరూ లేనంత సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా ఉండి, పార్టీని రెండుసార్లు అధికారానికి తెచ్చిన ఘనత సోనియాకు దక్కుతుంది.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'