పద్మావతి రిలీజ్ చేయోద్దంటూ ఆందోళనలు

November 05
09:29 2017

ఈ మధ్య కొంతకాలం నుంచీ సినిమాలపై పలు వివాదాలు రేగుతున్నాయి. కొన్ని సినిమాలపై సెన్సార్ బోర్డ్ కత్తి కడితే, మరికొన్ని సినిమాల విషయంలో ప్రజాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ఏదైనా చారిత్రక ఇతివృత్తంతో చిత్రం తీయాలంటే నిర్మాతలు వెనకాడే పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ మూవీ పద్మావతికి మొదటి నుంచీ కష్టాలు తప్పడం లేదు. తాజాగా ఆ సినిమాకు మరో కొత్త సమస్య వచ్చిపడింది.

బ్రహ్మాండమైన చారిత్రక నేపథ్యంతో, భారీ ఎత్తున తీసిన బాలీవుడ్ మూవీ పద్మావతి కి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిత‌మైన ‘ప‌ద్మావతి’ సినిమాలోని స‌న్నివేశాలు అభ్యంత‌రంగా తీశారని, ఈ సినిమాలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని అందుకోసం తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ కి ఒప్పుకోబోమని రాజ్‌పుట్‌ కర్ణి సేన జాతీయ కన్వీనర్‌ ప్రమోద్‌ రాణా తేల్చి చెప్పారు. పద్మావతి సినిమాను వ్యతిరేకిస్తూ కర్ణిసేన కొంతకాలంగా ఆందోళన చేస్తోంది కూడా. పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. ఈ సినిమా విడుదలకు అభ్యంత‌రాలు తెలుపుతూ ఆ రాష్ట్రంలోని చిత్తోర్‌ఘర్‌లో భారీ ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించి బంద్‌ను పాటించారు. ఎలక్షన్ సమయంలో ఈ వివాదాలు తమకు ఇబ్బంది కలిగిస్తాయని.. కాబట్టి ఆ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని కోరుతూ బీజేపీ ఎలక్షన్ కమీషన్‌కు మొర పెట్టుకుంది.

ప‌ద్మావ‌తి సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే అక్కడి క్షత్రియులు, క‌ర్ణిసేన‌ ఓటింగ్‌లో పాల్గొనరని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై యూనియ‌న్ మినిస్టర్ ఉమా భారతి . ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని తెలిపారు. “పద్మావతి సినిమా స్టోరీ రాజపుత్ కమ్యూనిటీతో అసోసియేట్ అయి లేదు.. భారతీయ స్త్రీ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. అని ట్వీట్ చేశారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'