నాని..ఎంసీఏ సెన్సార్ పూర్తి

December 15
20:16 2017

 

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా  ఎంసీఏ. ఫిదా ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీటైన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబ‌ర్ 21న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో ఈ  ఏడాది `శ‌త‌మానంభ‌వ‌తి`, `నేను లోక‌ల్‌`, `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`, `ఫిదా`, `రాజా ది గ్రేట్` చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను చేశాం. ఇప్పుడు `ఎం.సి.ఎ`తో డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యాం. ఈ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ సాధిస్తామ‌నే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.  చాలా గ్యాప్ త‌ర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది.  వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య  అనుబంధంపై సినిమా ఉంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారని తెలిపారు.  అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైనప్ప‌టి నుండి అంచ‌నాలు మరింతగా పెరిగాయని..అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌,  క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'