టిచర్ పాత్రలో సక్సెస్ ఫుల్ హీరోయిన్

December 16
15:47 2017

ఆక్సిజన్ సినిమా తరువాత గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ సినిమా ఇటివల ప్రారంభం అయ్యింది. చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. బెంగాల్ టైగ‌ర్ సినిమా రాధామోహన్ ఈ సినిమాను శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మెహరిన్ హీరొయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం మెహరిన్ ఈ సినిమాలో టిచర్ పాత్రలో కనిపించబోతుంది. మెహరిన్ న‌టిస్తోన్న 5వ చిత్రం, గోపీచంద్‌గారికి 25వ చిత్రం కావ‌డం విశేషం. రమేష్ రెడ్డి మాటలు రాస్తున్న ఈ సినిమాకు ప్ర‌సాద్ మూరెళ్ల‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ మూవీ తో గోపీచంద్ హిట్ కొడతాడని ఆశిద్దాం.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'