స్పెయిన్‌ ఉక్కుపాదం.. సర్కారు రద్దు

October 21
19:59 2017

ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న క్యాటలోనియాపై స్పెయిన్‌ ఉక్కుపాదం మోపుతోంది. క్యాటలోనియా పార్లమెంటు అధికారాలను నియంత్రించి.. ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని  స్పెయిన్‌ ప్రధానమంత్రి మరియానో రాజోయ్‌ వెల్లడించారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న  ఈ ప్రాంతంలో ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.

స్వతంత్ర ప్రాతిపత్తి గల క్యాటలోనియాలో ఇటీవల స్పెయిన్‌ నుంచి విడిపోయేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగిన సంగతి తెలిసిందే. స్వయంగా క్యాటలోనియా ప్రభుత్వమే ఈ ఉద్యమాన్ని చేపట్టింది. కొన్ని వారాల కిందట స్వతంత్ర క్యాటలోనియా కోసం రిఫెరెండం నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్వతంత్ర క్యాటలోనియాకు ప్రజామద్దతు లభించినా.. ఈ రెఫరెండాన్ని స్పెయిన్‌ సర్కారు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన స్పెయిన్‌ కేబినెట్‌ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పెయిన్‌ కేబినెట్‌ ఆమోదం పొందిన ఈ నిర్ణయాలు.. పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంది.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'