5 న ఐడిపి,ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ఫెయిర్

February 03
20:05 2017

ఈ నెల 5 వ తేదిన ఐడిపి ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ఫెయిర్ ను హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ నిర్వహిస్తున్నట్లు ఐడిపి సంస్థ ఇండియా డైరెక్టర్ పియూష్ కుమార్ తెలిపారు.శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో విద్య నభ్యసిన్చాలనే విద్యార్థులకు ఇది చక్కని అవకాశం అన్నారు.ఈ ఫేర్లో  ఆస్ట్రేలియాలోని 40 ప్రముఖ యునివర్సిటీ లు,ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పాల్గొంటున్నట్లు తెలిపారు.ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించే ఈ ఫెయిర్ లో విద్యార్థులు పాల్గొని వారి వారి అనుమానాలను నివృత్తి చేసుకొని దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు.ఇందులో ఆయా విద్యాసంస్తలకు చెందిన ప్రతి నిధులు వారి వారి విధ్యా సంస్థల గూర్చి వివరించడమే కాకుండా విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తారన్నారు.ఇది విద్యార్థులకు ఏంతో చక్కటి అవకాశామన్నారు.అంతే కాకుండా ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ల పూర్తి సమాచారం లభిస్తుందన్నారు.మొత్తం దేశవ్యాప్తంగా 14 నగరాల్లో ఈ ఫెయిర్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.మొదటి ఫెయిర్ ను జనవరి 22 న కలకత్తాలో నిర్వహించామని, చివరి ఫెయిర్ ను ఈ నెల9నకోయంబత్తూరులోనిర్వహిస్తున్నట్లుతెలిపారు.అలాగేలుధియానా,చండిఘడ్,గుర్గాం,న్యూడిల్లీ,ముంబాయ్,అహమ్మదాబాద్,పూనే,బెంగళూర్ ,చెన్నయ్,విజయవాడ,కొచ్చి,లలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సదవకాశాన్ని విదేశే విద్య నబ్య్హసించే విద్యార్థులు వినియోగించుకోవాలని పియూష్ కుమార్ కోరారు.

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'