ఆధార్ డెడ్‌లైన్ మార్చి 31

December 15
13:37 2017

న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లతో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడవును పొడిగించారు. ఈ మేరకు ఇవాళ సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. మార్చి వరకు గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ ఆధార్‌పై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆధార్‌ను అన్ని స్కీమ్‌లకు అనుసంధానం చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు విచారణకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు లేని వారు కూడా తాజా ఆదేశాల‌తో కొత్త‌గా బ్యాంక్ అకౌంట్లు తీసుకోవ‌చ్చు. ఆధార్‌పై మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. గ‌తంలో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఉన్న డెడ్‌లైన్‌ను ఇవాళ మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు పొడిగించారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'