నిన్న 44.. నేడు 130

December 30
12:00 2017

చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ప్రక్షాళన కొనసాగుతోంది. పార్టీలో టీటీవీ దినకరన్‌ మద్దతుదారుల ఏరివేతపై అధిష్ఠానం దృష్టి సారించింది. గురువారం 44 మంది దినకరన్‌ మద్దతుదారులపై వేటు వేసిన అన్నాడీఎంకే నేడు మరో 130 మందిపై వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తిరుపూర్‌, పుడుకొట్టాయ్‌, ధర్మపురి ప్రాంతాల్లోని దినకరన్‌ మద్దతుదారులైన 132 మందిని పార్టీ నుంచి బహిష్కరించింది. తిరుపూర్‌ నుంచి 65, పుడుకొట్టాయ్‌ 49, ధర్మపురి 18 మందిని పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.

వీళ్లంతా పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.ఇటీవల వెలువడిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉండి.. దినకరన్‌కు మద్దతిచ్చిన తొమ్మిది మందిపై వేటు వేసింది. మూడు రోజుల వ్యవధిలోనే మరో 44 మందిని పార్టీ నుంచి తప్పించింది.

తాజాగా.. మరో 130 మందిని పార్టీ నుంచి బహిష్కరించింది. దినకరన్‌ విజయం సాధించాక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సుమారు 50 మంది ఫోన్‌ ద్వారా ఆయనతో మాట్లాడారని, శుభాకాంక్షలు చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరింత మందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'