భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

December 15
13:48 2017

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చండ్ర పుల్లారెడ్డిబాట గ్రూపునకు చెందిన ఎనిమిదిమంది నక్సలైట్లు మృతిచెందారు. బోడు పోలీస్‌స్టేషన్ పరిధి మల్లెమడుగు గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సాయుధ నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్టు తెలిపారు.

సుమారు పది నుంచి 12 మంది సాయుధులైన సీపీబాట నక్సలైట్లు సంచరిస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, మిగతావారు తప్పించుకొని ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు. మృతుల్లో దళ కమాండర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఎట్టి కుమార్ అలియాస్ రాఖీ, గట్టుమల్లకుచెందిన బీ ఆదినారాయణ, బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన నూనావత్ అర్జున్ అలియాస్ నవీన్, మంచిర్యాల జిల్లా ఖాసీపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన జక్కేటి ప్రవీణ్‌కుమార్ అలియాస్ ఆజాద్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన బోనబోయిన ఓంప్రకాశ్ అలియాస్ గణేశ్, గుండాల మండలం కొడవటంచా గ్రామానికి చెందిన ఈసం నరేశ్ అలియాస్ సుదర్శన్, గుండాల మండల కేంద్రానికి చెందిన తుర్కులి మధును గుర్తించినట్టు ఎస్పీ వెల్లడించారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'