గుజరాత్ లో మేం ఓడిపోతాం

December 17
17:11 2017

తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో  గుజరాత్ లో బీజేపీదే అధికారం అని అన్నీఎగ్జిట్‌పోల్స్‌ తేల్చి చెప్పాయి. కానీ అక్కడ బీజేపీకి ఓటమి తప్పదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే తెలిపారు.  ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ఉపయోగించిన మతతత్వమే ఓటమికి కారణం అవనుందన్నారు కాకడే.

తాను జరిపిన సర్వేలో గుజరాత్‌లో తొలిసారిగా దళితులు, ఓబీసీలు, ముస్లింలు, పటేల్‌ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారని,  దాదాపు 75శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచినట్లు  తన సర్వేలో తేలిందన్నారు కాకడే. మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్‌ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణం కానుందని కాకడే తెలిపారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'