గిన్నిస్ రికార్డులో భారతీయ కిచిడీ

November 05
09:26 2017

న్యూఢిల్లీ: భారతీయులకు అత్యంత ఇష్టమైన కిచిడీ వంటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దేశ రాజధానిలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శనివారం 918 కిలోల కిచిడీని తయారు చేశారు. దీంతో గిన్నిస్ రికార్డులో కిచిడీ చోటు సంపాదించింది. ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్ కపూర్ ఆధ్వర్యంలో ఈ వంటకాన్ని వండారు. 1200కిలోల వంటకాన్ని తయారు చేసే సామర్థ్యం ఉన్న పెద్దపాత్రలో బియ్యం, పప్పులు, కూరగాయలు, మసాలాలతో కిచిడీని తయారు చేస్తుంటే ఆ ప్రాంతమంతా ఘుమఘుమలాడింది.

ముఖ్యఅతిథులుగా హాజరైన కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా గరిటె తిప్పారు. ఇంత భారీ స్థాయిలో కిచిడీని తయారు చేయడాన్ని చూసిన గిన్నిస్‌బుక్ ప్రతినిధులు భారతీయ కిచిడీ ప్రపంచ రికార్డును సృష్టించిందని ప్రకటించారు. కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ భారత సంప్రదాయ వంటకానికి కిచిడీ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ కిచిడీని మించిన వంటకం లేదని, ఇది మంచి పౌష్ఠికాహారమని అన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'