కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ

December 22
11:34 2017

న్యూ ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంభందించి ఈనెల 27వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ గనుల శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, టాస్క్ ఫోర్సు కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ చెప్పారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే మౌలిక వసతులను, టాస్క్ ఫోర్సు కమిటీ ఫీజెబులిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గనులు,

సంభందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.  ముడిసరుకు రవాణా, ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు పోర్టు సౌకర్యం, ముడిసరుకు రవాణాకు రోడ్, రైలు మార్గం ఏర్పాటుకు, భూమి, నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను ఏమేరకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చ గలదో పరిశీలించి తగు నిర్ణయం గైకొననున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుసరించి రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేయూతనిచ్చి ఆర్దికాభివ్రుద్ధితోపాటు ఉపాధి అవకాశాలను కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా వున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  ఈమేరకు మికాన్ కన్సల్టెన్సీ, టాస్క్ ఫోర్సు కమిటీ పరిశీలన చేసి ప్రాధమిక సూచనలు చేశాయన్నారు.   ఈ అంశంపై మరొక దఫా ఈనెల 27వ తేదిన న్యూ ఢిల్లీ లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'