జనవరి 1న ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే ఆడబిడ్డకు ఉచిత విద్య

December 30
11:56 2017

బెంగళూరు : జనవరి 1న బెంగళూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే తొలి ఆడబిడ్డకు డిగ్రీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని బెంగళూరు నగర మేయర్‌ ప్రకటించారు. అదేంటి.. ఎవరైనా ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి అనో.. మహాలక్ష్మి అనో పిలుస్తారు కదా! మరి అదృష్ట సరస్వతి ఏంటి అనుకుంటున్నారా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు బెంగళూరు నగర మేయర్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనవరి 1న బెంగళూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే తొలి ఆడబిడ్డకు డిగ్రీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.

బెంగళూరు నగరంలోని ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో జనవరి 1న పుట్టిన తొలిబిడ్డకు ఉచిత విద్య అందజేస్తామని బెంగళూరు మేయర్‌ ఆర్‌.సంపత్‌రాజ్‌ ప్రకటించారు. సాధారణ కాన్పు ద్వారా జన్మించిన ఆ తొలి బిడ్డ, నగర కమిషనర్‌ పేరిట ఓ ఉమ్మడి ఖాతాను తెరిచి బృహత్‌ బెంగళూరు మహానగర్‌ పలికె (బీబీఎంపీ) రూ.5లక్షలను డిపాజిట్‌ చేస్తుందన్నారు. దానిపై వచ్చే వడ్డీని ఆ అమ్మాయి చదువుకు వినియోగిస్తారని మేయర్‌ పేర్కొన్నారు.నూతన సంవత్సరం రోజు పుట్టిన తొలి బిడ్డను ఎంపిక చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ వైద్య సిబ్బంది ప్రసవ సమయాలలను నమోదు చేస్తారు.

అలా పుట్టిన వారి నుంచి తొలుత జన్మించిన ఆడ పిల్లను ఎంపిక చేస్తారు. సిజేరియన్‌ ద్వారా జన్మించిన బిడ్డకు ఇది వర్తించదని పేర్కొన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'