యాచకుని ఫిక్సెడ్ డిపాజిట్ల విలువ అక్షరాల రూ.1.06 కోట్లు

December 22
10:21 2017

లక్నో:వీధుల్లో కనిపించిన ప్రతిఒక్కరిని యాచించే సదరు వ్యక్తి పేరు ముత్తయ్య. కోటీశ్వరుడని.. అతడి ఆస్తి.. బ్యాంకు బ్యాలెన్స్ తెలిసిన వారంతా నోటి మాట అవాక్కు అవుతున్నారు.తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. యూపీలోని బరేలీ జిల్లాలోని రాల్పూరులో ముత్తయ్య అనే వృద్ధుడు అడుక్కుంటున్నాడు. ఇదిలా  ఉంటే.. వృద్ధుడి దీనస్థితిని చూసి  స్వామి భాస్కర్ స్వరూప్ జీ అనే  స్వచ్చంద సంస్థ అతడ్ని చేరదీసింది.  అతడి దగ్గర ఆధార్ కార్డును చూసి.. అతడి వివరాల్ని రాబట్టే ప్రయత్నం చేశారు.

ఆ వృద్ధుడి దగ్గరున్న బ్యాంకు డిపాజిట్ల పత్రాల్ని చూసి నివ్వెరుపోయారు ఎందుకంటే.. ముత్తయ్య దగ్గరున్న ఫిక్సెడ్ డిపాజిట్ల విలువే అక్షరాల రూ.1.06 కోట్ల విలువ ఉన్నవన్న విషయాన్ని గుర్తించారు. ఆశ్చర్యపోయిన సంస్థ ప్రతినిధులు ముత్తయ్య వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.ఆధార్ కార్డును సాయం చేసుకొని వెతికిన వారికి ముత్తయ్య కుటుంబ సభ్యుల వివరాలు లభించాయి. వారికి సమాచారం ఇవ్వటంతో వచ్చి ముత్తయ్యను తమతో తీసుకెళ్లారు. ఇటీవల మతిమరుపు జబ్బుతో ఇంటి నుంచి తప్పిపోయారని.. అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతున్నా ఫలితం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆర్నెల్ల క్రితం తన తండ్రి రైల్లో తప్పిపోయారని ఆయన కుమార్తె వెల్లడించారు.

రోజుల్ని గడిపేందుకు యాచకుడిగా ముత్తయ్య మారిపోయినట్లు గుర్తించారు. కాగా ముత్తయ్య వద్ద డబ్బు ఉందని తెలిసిన అతని కుటుంబ సబ్యులు అతన్ని చేర దీసారా లేక నిజంగానే ఆటను మాటు బ్రమించి ఇంటిలోంచి వెళ్ళిపోయాడా అన్నది చర్చనీయంశామైంది.ఏది ఏమైనా ధన మూలమ్ ఇదమ్ జగత్ర్ అన్నారు పెద్దలు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'