చర్చిపై ఉగ్ర దాడి : 8 మంది మృతి

December 17
16:49 2017

పాకిస్థాన్ : బలూచిస్థాన్ క్వెట్టాలోని ఓ చర్చిలో ఆదివారం మధ్యాహ్నం రక్తపుటేరులు పారాయి. జార్గూన్ రోడ్‌లోని బెతేల్ మెమోరియల్ చర్చిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. చర్చి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు బలూచిస్థాన్ హోం మంత్రి మిర్ సర్ఫరాజ్ స్పష్టం చేశారు. ఒకరు చర్చి గేట్ వద్ద, మరొకరు చర్చి హాల్ వెలుపల ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ముష్కరుల దాడిలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో చర్చిలో సుమారు 400 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల దాడిని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఖండించారు. 2015, మార్చి 15న లాహోర్‌లోని రెండు చర్చిల్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో.. 15 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'