ఘనంగా చెత్త‌విడాకుల దినోత్స‌వం

February 01
16:24 2017

bonthu-rammohanన‌గ‌రంలో చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌గా వేరు చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా చైత‌న్య కార్య‌క్ర‌మంలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిర్వ‌హించిన *చెత్త విడాకుల దినోత్స‌వం*లో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియోద్దీన్‌తో స‌హా ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, కార్పొరేట‌ర్లు పాల్గొని విజ‌య‌వంతం చేశారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ బాలాన‌గ‌ర్, ఫిరోజ్‌గూడ‌, వాణిన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో పాల్గొని స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌, చెత్తను త‌డి, పొడి చెత్త‌గా విడ‌దీసే అంశంపై చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను అక‌స్మికంగా త‌నిఖీ చేసి స్టేష‌న్‌లో చేప‌డుతున్న పారిశుధ్య కార్య‌క్ర‌మాలపై త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంత‌రం రైల్వేస్టేష‌న్‌లో రైల్వే అధికారుల‌తో క‌లిసి స్టేష‌న్‌లో నిర్వ‌హిస్తున్న పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లోని ప‌లు కాల‌నీల్లో ప‌ర్య‌టించారు. ఫిరోజ్‌గూడ, కుత్బుల్లాపూర్‌లోని మీనాక్షికాల‌నీ, శ్రీ‌ని ఎన్‌క్లేవ్‌ల‌లో ప‌ర్య‌టించి స్థానిక రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ పై గోడ‌ల‌పై వేయించిన పెయింటింగ్‌ల‌ను క‌మిష‌న‌ర్ ప‌రిశీలించిన‌ అనంత‌రం సూరారంలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయ‌ల భోజ‌న కేంద్రాన్ని త‌నిఖీ చేసి భోజ‌నం చేశారు. వంద శాతం చెత్త‌ను వేర్వేరుచేసే స్వ‌చ్ఛ ఆటోడ్రైవ‌ర్లంద‌రికీ ఉచితంగా యూనిఫాంను అందించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆదేశించారు.

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'