శాంతిభద్రతల దృష్ట్యా అలా చేశాం

December 16
15:27 2017

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణంపై విచారణ కమిషన్‌ నుంచి తమకు ఎటువంటి పిలుపు అందలేదని అపోలో గ్రూప్‌ ఆసుపత్రుల చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి శనివారం వెల్లడించారు. జయలలితను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జ్వరంతో బాధపడుతున్నామనే ప్రకటనను ఇచ్చినట్లు వివరించారు. విచారణ కమిషన్‌ నుంచి పిలుపు వస్తే.. జయలలిత మరణం విషయంపై అన్ని వివరాలను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'