రాజకీయాలకు సోనియా గుడ్‌బై

December 15
13:33 2017

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. రేపటితో క్రియాశీలక రాజకీయాల నుంచి సోనియా వైదొలగనున్నారు. పార్లమెంట్ సమావేశాల వాయిదా అనంతరం బయటకు వచ్చిన సోనియాను మీడియా పలుకరించింది. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏం చేయబోతున్నారని ఆమెను మీడియా ప్రశ్నించగా.. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన నేపథ్యంలో ఆయన శనివారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

19 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా అత్యధిక కాలం సేవలందించిన సోనియా.. యువ నాయకత్వానికి అవకాశమివ్వాలని భావించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి సోనియాకు ఆరోగ్యం కూడా సరిగా సహకరించడం లేదు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏడేళ్లు రాజకీయాలకు గాంధీ కుటుంబం దూరంగా ఉన్నది. ఏడేళ్ల తర్వాత సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకురాలిగా సోనియా పని చేశారు. 2004 మే 16 నుంచి యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా బాధ్యతలు చేపట్టారు. 1999లో అమేథీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి రాయ్ బరేలీ ఎంపీగా సోనియా కొనసాగుతున్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'