ట్రాన్స్‌జెండర్ 2016బిల్లును వ్యతిరేకిస్తూ హిజ్రాల ధర్నా

December 17
20:17 2017

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో దేశ వ్యాప్తంగా ఉన్న హిజ్రాల నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ట్రాన్స్‌జెండర్ 2016బిల్లును వ్యతిరేకిస్తూ హిజ్రాలు పార్లమెంటు స్ట్రీట్‌లో ధర్నాచేశారు. హిజ్రాల జీవన శైలి పట్టించుకోకుండా ట్రాన్స్‌జెండర్ బిల్లు తయారు చేశారంటూ వారు వాపోయారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హిజ్రాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బిల్లు రూపొందించారని, బిల్లు వల్ల తాము నష్టపోతామని స్నేహ, రేష్మ, దుర్గ అనే హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ బిల్లు వ్యతిరేకిస్తూ ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చిన వందలాది హిజ్రాలు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిజ్రాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరు వారు ఖండించారు.

కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాన్స్‌జెండర్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఏపీలో సొంత గృహలను కూడా నిర్మించారని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర కూడా తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా న్యాయం చేయాలని స్నేహ, రేష్మ, దుర్గ విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌జెండర్ పాలసీకి ఏపీ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడిన ట్రాన్స్‌జెండర్లకు రూ. 1500 పెన్షన్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఉపాధికల్పన కోసం వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కేబినెట్ తీర్మానించింది.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'