ప్రజల తీర్పును స్వాగతిస్తున్న

December 18
09:58 2017

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఆ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రెండు రాష్ర్టాల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. తన పట్ల ప్రేమను ప్రదర్శించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ సోదరసోదరీమణులు తాను గర్వపడేవిధంగా వ్యవహరించారని, మీరు చాలా విభిన్నమైన వారు అని, హుందాతనంతో ఎన్నికల్లో పోరాటం చేశారని, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం తన శౌర్యం, హుందాతనంలోనే ఉన్నదని నిరూపించారని రాహుల్ తన ట్విట్‌లో కార్యకర్తలను కీర్తించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 99,, కాంగ్రెస్‌కు 77 స్థానాలు వచ్చాయి. ఇక హిమాచల్‌లోనూ బీజేపీ 44,కాంగ్రెస్ 21సీట్లు దక్కాయి.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'