ఇల్లు అలకంగానే పండుగ కాదు

December 30
12:19 2017

హైదరాబాద్: జనాభాలో అత్యధికంగా ఉన్నగొల్ల, కుర్మ జాతి భారతదేశానికి దిక్సూచి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.  గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల, కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారు. ఇల్లు అలకంగానే పండుగ కాదు. ఏదన్నా పట్టుకున్నామంటే గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తామని సీఎం అన్నారు.మన వద్ద సంఘటిత శక్తి లేకనే అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఆ బాధ పోవాలంటే మనలో ఐకమత్యం రావాలన్నారు సీఎం. నేటి ప్రయాణంతో అద్భుతం జరగాలి. గొల్ల, కుర్మలలో ఎవరూ అనాథలుగా ఉన్న వారికి అన్నం దొరకాలి.

తల్లిదండ్రులు లేని బిడ్డులున్నా.. వారి పెళ్లిళ్లు ఈ సంక్షేమ భవనంలో జరగాలి. గొల్ల, కుర్మల సంఘం నిధికి మూలధనం కింద బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి రూ. కోటి మంజూరు చేస్తున్నా. ఈ నిధి అద్భుతంగా మన జాతికి ఉపయోగపడుతుంది. సంక్షేమానికి దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ రాష్ర్టానికి రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. 350లారీలు ఒక్క హైదరాబాద్‌కే దిగుమతి అవుతున్నాయి. నవాబులు కట్టించిన మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న తర్వాత కూడా చేపల పెంపకం నిర్లక్ష్యానికి గురైంది. రాంనగర్ మార్కెట్‌కు20 నుంచి 25లారీల చేపలు వస్తున్నాయి. గొల్ల, కుర్మల జనాభా 30లక్షల జనాభా ఉంది. గంగపుత్రుల జనాభా 40 లక్షలు ఉంది. గొర్రెలు, చేపల పెంపకానికి తెలంగాణలో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అసెంబ్లీలో సీఎం ఏ విధంగా చెప్పిండో.. ఆ విధంగా.. అద్భుతంగా గొర్రెల పిల్లల పెంపకం జరుగుతుందని వార్తలు చూశాను. ఇతర రాష్ర్టాల నుంచి 35లక్షలు గొర్రెలు తెస్తే.. వాటికి 13 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా 48 లక్షల గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి. దీని ద్వారా కొన్ని వేల కోట్ల సంపదను యాదవులు సృష్టించబోతున్నారు.

మూడు, నాలుగు సంవత్సరాలు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైన గొల్ల,కుర్మలు ఎక్కడా ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే రోజు వస్తుందన్నారు.గొర్రెల యూనిట్ల పంపిణీకి రెండే కొలమానం. ఆయన గొల్ల కావాలి. కుర్మ కావాలి. 18 ఏండ్ల వయసు నిండి ఉండాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి గొర్రెలు ఇవ్వాలని చెప్పాం. ఆ ప్రతిపాదికనే గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు. ఎన్ని లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయో.. అంతకు అంత ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆనాడే చెప్పాను. 7 లక్షల 61వేల మందికి గొర్రెల పంపిణీ కొనసాగుతుంది. మరో5వేల కోట్ల రూపాయాలు ఖర్చు అవుతంది. దీనికి వెనుకకు వెళ్లాం. సబ్సిడీ గొర్రెలు అమ్ముతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు పని జరగకుండా.. చూడాలి. ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలని గొల్ల, కుర్మలకు సీఎం కేసీఆర్ సూచించారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'