కాంగ్రెస్ వాళ్ల దిమ్మ‌తిరిగేలా చేసిన‌…. రేవంత్‌రెడ్డి

October 20
20:37 2017

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారయింది…అదేంటి ఏమయింది అనేగా…ఒకసారి ఈ కధ చదవండి మీకే ఒక క్లారిటీ వస్తుంది…తెలంగాణా తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి…పార్టీ మారుతున్నాడు అన్న ఊహాగానాలు వార్తల్లో నిలవడంతో ఇప్పుడు మీడియా అంతా హాట్ హాట్ గా రేవంత్ పైనే ఫోకస్ పెట్టింది…అయితే రేవంత్ ఒక పక్క చాలా క్లారిటీగా ఉన్నాడు. కర్ర విరగకుండా…పాము చావకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్లాన్ చేస్తున్నాడు…ఇదిలా ఉంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం రేవంత్ కి ఇంకా కాంగ్రెస్ తో డీల్ సెట్ కాలేదని…దానికి కారణం రేవంత్ కోర్కెల చిట్టా చాంతాడు అంత ఉంది అని గాసిప్స్ బలంగా వినిపిస్తూ ఉన్నాయి…అయితే అసలు రేవంత్ కాంగ్రెస్ ని ఏం కోరాడు…కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అంటే…తాను కాంగ్రెస్‌లో చేరాలంటే.. ప్ర‌చార క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు.. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు అయిని 25 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల‌ని ఆ పేర్ల జాబితాను సైతం రాహుల్ కి రేవంత్ అందజేసినట్లు తెలుస్తుంది. ఇక కాంట్ర్యాక్ట్స్, డబ్బు, అవన్నీ కామన్ అనుకోండీ…అయితే దీనిపై రాహుల్ స్పందిస్తూ 15 ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం…అయితే ఈ న్యూస్ బయటకు రావడంతో ఒక్కసారిగా అవక్కయ్యింది తెలంగాణా కాంగ్రెస్ పార్టీ…అయితే రేవంత్ రెడ్డి ‘ఎసరు’ పెట్టిన సీట్లు ఎవరివి? రేవంత్ ఎఫెక్ట్ ఏ నియోజ‌క‌వ‌ర్గాల మీద పడుతుంది ?ఇప్పుడున్న నాయకుల్లో ఎవ‌రి సీట్ల‌కు ముప్పు వస్తుంది? అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసి నిద్ర పట్టకుండా చేస్తుంది. మరి ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందో? మైనస్ అవుతుందో? కాలమే నిర్ణయించాలి.

 

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'