పర్యాటకులకు ప్రజలు సహకరించాలి

October 21
20:23 2017

ప్రో. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పర్యాటక, చారిత్రక మరియు వారసత్వ కట్టడాల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ల కార్యదర్శి బుర్రా వెంకటేశం పర్యవేక్షించారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారి వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రముఖ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం ప్రహారి గోడ మరమ్మత్తు కోసం జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. రామప్ప దేవాలయమునకు ఉన్న వారసత్వ చరిత్ర ప్రపంచానికి తెలియజేయాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అంతర్జాతీయ స్థాయి వేదికల వద్ద రామప్ప కీర్తిని తగిన ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.

రామప్ప దేవాలయంకు యునేస్కో వారసత్వ గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రతిపాదనలు యునేస్కో కు పంపామన్నారు. రామప్ప దేవాలయం వద్ద పర్యటకుల కోసం నిర్మిస్తున్న కుటీరాల నిర్మాణాలను పరిశీలించారు.  రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాలలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని , పర్యాటకులకు స్థానిక ప్రజలు సహాకరించాలని, రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యటకులు తాకిడి పేరిగిందని, పర్యాటకులకు అవసరమైన సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని టూరిజం, పురావస్తు శాఖ అధికారులకు సూచనలు చేసారు.అనంతరం బోగతా వాటర్ పాల్స్ వద్ద జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వాటర్ పాల్స్ వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలపై అటవి మరియు టూరిజం శాఖల అధికారులకు తగు సూచనలు చేసారు. వాటర్ పాల్స్ వద్దకు చేరుకుంటున్న పర్యాటకుల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించాలని, అటవి శాఖ, పర్యాటక శాఖల అధికారులు సమన్వయం ఉండాలని పేర్కోన్నారు. జలపాతాలను వీక్షీంచటం  కోసం తరిలివస్తున్న పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఆదనంగా నిర్మిస్తున్న వసతి గృహాల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అదనపు కాటేజ్ ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అదేశాలు జారీ చేసారు

లక్నవరం ద్విపము లో పర్యాటకులకు అవసరమైన సదుపాయాల అభివృద్ధి పై టూరిజం, ఐటిడిఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లక్నవరం ద్విపము అభివృద్ధి లో భాగంగా ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పలు పర్యాటక వసతి గృహాలను పరిశీలించారు. పర్యాటకులకు అవసరమైన సదుపాయాలను 10 రోజులలో పూర్తి చేయాలని టూరిజం అధికారులను ఆదేశించారు .దేశంలో అతిపెద్ద జాతరలో ఒకటైన సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వాహాణ కోసం చేపడుతున్న నిర్మాణ పనుల పై క్షేత్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహా జాతర ప్రారంభం కంటే ముందు అన్ని పనులు పూర్తి చేయాలని,లక్షలాదిగా తరలివస్తున్న పర్యటకులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని టూరిజం అధికారులకు తగు సూచనలు చేసారు. ఈ సమీక్షా సమావేశంలో మేడారం ఐటిడిఏ అటవి శాఖల  అధికారులు పాల్గోన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'