అమెరికాలో పందెం కోళ్లను పట్టుకున్నారు?

December 22
11:21 2017

హైదరాబాద్; సంక్రాంతి అనగానే సహజంగానే కోడిపందేలు గుర్తుకువస్తాయి.ఈ పందాలకు ఏపినే కాదు విదేశాలలో సహితం పందాలు నిర్వహిస్తున్నారు.ఈ ఏ డాది సంక్రాంతి సంబరాలు ఆసక్తికరమైన పరిణామాలకు వేదికగా మారుతున్నాయి. గత ఏడాది పందేలను అడ్డుకోవడంలో భాగంగా పోలీసులు ముందస్తుగా దాడులు జరిపి పుంజులను స్వాధీనం చేసుకోవడం కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదుచేయడం వంటి చర్యలు చేపట్టారు. కాగా తాజాగా అమెరికాలో భారీ సంఖ్యలో పందెం కోళ్లను పట్టుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అమెరికాలో ఏంటి? పందెం కోళ్లేంటి అనుకుంటున్నారా? నిజమే.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.. ఈ ఏడాది లాస్ ఏంజిల్స్ పోలీసులు ఏకంగా 8 వేల కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ – చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్ల పందేలు వేసే ముఠాలున్నాయట.

కొందరు ఇళ్లలోనూ పందెం కోళ్లను ఎక్కువ సంఖ్యలో పెంచుతుండడంతో దీన్ని నియంత్రించడానికి చర్యలకు సిద్ధమవుతున్నారు. గత మే నెలలో 80ఎకరాల స్థలంలో పెంచుతున్న 7 వేల కోడిపుంజులను పట్టుకున్నారు. అమెరికా చరిత్రలోనే అంత భారీ సంఖ్యలో ఎప్పుడూ కోడిపుంజులను పట్టుకోలేదు. అప్పుడు కోడిపుంజులతో పాటు వాటి కాళ్లకు కట్టే రకరకాల చురకత్తులను… కోళ్లకు ఇంజక్షన్ చేయడానికి ఉంచిన స్టెరాయిడ్లు – ఇంజక్షన్ సిరంజిలను కూడా భారీ మొత్తంలో పట్టుకున్నారు. నెల రోజుల కిందట కూడా సుమారు 500 పందెం కోళ్లను పట్టుకుని ఆ ముఠా కార్యకలాపాలను అడ్డుకున్నారు.కాలిఫోర్నియాలోని వివిధ కౌంటీల్లో కోళ్ల పెంపకం పందేలను నియంత్రించే చట్టాలున్నాయి.

ఇప్పుడు లాస్ ఏంజిల్స్ చుట్టుపక్కలున్న కౌంటీల్లోనూ ఇలాంటి చట్టాలు తేనున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ సిటీలో ఇంటికో కోడి పెంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. అక్రమంగా పందేలు వేయడం ఎక్కువవడంతో దాంతో పాటు బెట్టింగులు వివిధ రకాల నేరాలు కూడా పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.మరోవైపు బ్రిటన్ లోనూ తాజాగా కోళ్ల పందేల ముఠాను పట్టుకున్నారు. కోళ్ల పందేలు నిర్వహించే బరి(రింగ్)పై పోలీసులు దాడి చేసి బ్రిటిష్-పాకిస్థాన్ ముఠాను పట్టుకున్నారు. మొత్తానికి ఈ కోడిపందేలు ఏపీలోనే కాదు విదేశాల్లోనూ పెద్ద ఇష్యూగా మారుతున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల పల్లెలు సిద్ధమైపోతున్నాయి.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'