10 రోజులు… 10 జిల్లాల్లో పర్యటనలు

December 30
12:05 2017

అమరావతి: ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోవడమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమ ముఖ్యోద్దేశమని, ఈ కార్యక్రమాన్ని పండగలా జరుపుకుందామన్నారు. వచ్చే నెల 2 వ తేదీ నుంచి పది రోజుల పాటు సాగే జన్మభూమి కార్యక్రమంలో పది జిల్లాల్లో పర్యటించినున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి లక్షా 80 వేల సమావేశాలు నిర్వహించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల్లో స్ఫూర్తి నింపేవిధంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి, పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడానికి కూడా వీలుకలుగుతోందన్నారు.

అదే సమయంలో పుట్టిన ఊరును, రాష్ట్రానికి విడిచి దేశ విదేశాల్లో ఉన్నవారు తమ జన్మభూమిని అభివృద్ధి చేసుకోడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఎందరో ఎన్ఆర్ఐలు, ఇతరులు తమ గ్రామాల్లో పాఠశాలలు, హాస్పిటల్ భవనాలు నిర్మించారన్నారు. మరెందరో తాగునీరు, రోడ్డు సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు జన్మభూమి కార్యక్రమాన్ని మోడల్ గా తీసుకుని తమ దేశాల్లో అమలు చేశాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రయాణం ఎన్నో ఒడిదిడుకులతో ప్రారంభమైందన్నారు.  ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. వారి సాయంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. అందుకోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ నాలుగు పర్యాయాలు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

వచ్చే నెల 2వ తేదీ నుంచి అయిదో విడత జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.ఇప్పటికే క్రిస్మస్ పండగను నిర్వహించుకున్నామని, మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం సంబరాన్ని, వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగను పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇన్ని పండగల మధ్య జనవరి రెండో తేదీ నుంచి నిర్వహించబోతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కూడా మరో పండగలా నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కొత్త పంట చేతికందికొచ్చే దశలో సంక్రాంతి పండగను చేసుకుంటామని, పిండివంటలు వండుకుని పెద్దల దీవెనలు తీసుకుంటామన్నారు. పశువులను కూడా పూజించి, ప్రకృతిని కూడా ఆరాధిస్తామన్నారు. ఇంతటి ఆనందకర సమయంలో గ్రామం, రాష్ట్రం గురించి చర్చించుకోవడం అందరి బాధ్యత అన్నారు. గతాన్ని నెమరువేసుకుని, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇందుకోసమే జన్మభూమి కార్యక్రమం కింద 10 రోజుల పాటు పలు సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇప్పటికే ఇంటింటికీ తెలుగుదేశం, కనెక్ట్ సీఎం యాప్, 1100 ద్వారా ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు వచ్చాయన్నారు. ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్ సమస్యలను గుర్తించి, ప్రాధాన్యతపరంగా ఆయా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాన్ ఫైనాన్సియల్ సమస్యలు వంద శాతం పరిష్కాయ్యేలా కృషి చేస్తామన్నారు.మొదటి రోజుసంక్షేమంసంతృప్తి, రెండో రోజుఆరోగ్యం – ఆనందం, మూడో రోజుస్వచ్ఛాంధ్రప్రదేశ్, నాలుగో రోజు విద్య –కాసం,అయిదో రోజు గ్రామీణ మౌలిక సదుపాయల కల్పన, ఆరవ రోజు   సహజవనరుల అభివృద్ధి, ఏడో రోజు        వ్యవసాయంఅనుంబంధం,ఎనిమిదో జుసుపరిపాలనటెక్నాలజీ,తొమ్మిదో రోజు   స్వర్ణాంధ్రప్రదేశ్ –పేదరికంపై గెలుపు,పదో రోజు ఆనందలహరి        ఇలా ఒక్కో రోజు ఒక్కో అంశంపై ప్రజలతో చర్చిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి రోజూ రెండు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 65 వేల సమావేశాలు, 16 వేల గ్రామలు సభలు…మొత్తం లక్షా 80 వేల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. సమావేశంలో అర గంట నుంచి 45 నిమిషాల పాటు గ్రామస్తులతో కలిసి ఆయా గ్రామాల పరిస్థితులపై చర్చంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశాల్లో వచ్చిన ఫిర్యాదులను ఆర్.టి.జి కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంటామన్నారు. కొత్త పింఛన్లు, కార్డులు కూడా పంపిణీ చేయనున్నామన్నారు. చంద్రన్న బీమా పథకం అమలులో భాగంగా రూ.150 కోట్లను బాధిత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేస్తామన్నారు.

రుణమేళా పేరుతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా 2 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నామన్నారు. బీమా క్లయిమ్ లు చెల్లిస్తామన్నారు. గతంలో కంటే ఎంతో పగడ్బందీగా అయిదో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా గతంలో వ్యవసాయాన్ని గౌరవిస్తూ ఏరువాక, నీటిని ఆరాధిస్తూ జలశ్రీ, నీరు-వనం పేరుతో వనమహోత్సవాలు నిర్వహించామన్నారు. ఈ భూ ప్రపంచంలో సూర్యుడి పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. సూర్యుడి గొప్పతనాన్ని గుర్తిస్తూ, వచ్చే నెలలో సూర్య ఆరాధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.జన్మభూమి చివరి రోజున నిర్వహించే ఆనంద లహరి కార్యక్రమం సందర్బంగా ఫుడ్ ఫెస్టివల్, వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, రంగవళ్లులు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యంగా ప్రాచీన క్రీడలకు జీవం పోసేలా క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇలా గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ రైతులను, విద్యార్థులను, ఆరోగ్యవంతులను కూడా సన్మానించనున్నామన్నారు.జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో సందర్భంగా వచ్చే నెల 2 తేద నుంచి పది రోజుల పాటు పది జిల్లాల్లో పర్యటించనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి కృషిచేస్తున్నామన్నారు. జన్మభూమిలో వచ్చే వినతులకు పరిష్కారం చూపుతామన్నారు. నాన్ ఫైనాన్సియల్ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపకూడదన్నారు. గతంలో కంటే అధికారుల పనితీరు ఎంతో మెరుగుపడిందన్నారు. ఇ ఫైళ్ల విధానం అమల్లోకి రావడంతో ఎప్పటికప్పుడు ఫైళ్లు పరిష్కారమవుతున్నాయన్నారు.అభివృద్ధి ఆధారంగా పంచాయతీలకు స్టార్ రేటింగ్ లు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా స్టార్ రేటింగ్ లు ఇస్తామన్నారు.

పౌష్టికాహారం కల్పనకూ రేటింగ్ ఇవ్వనున్నామన్నారు. 10 స్టార్ రేటింగ్ లు వచ్చిన పంచాయతీలను ఉత్తమ పంచాయతీలు గుర్తించి, ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు.రాష్ట్రంలో లక్షా 50 వేల ఎకరాల్లో ఆర్గానికి వ్యవసాయం సాగు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇదే ప్రపంచంలోనే ఒక రికార్డు అన్నారు. ఈ స్థాయిలో మరెక్కడా సేంద్రీయ వ్యవసాయం సాగు చేయడంలేదన్నారు. ఏటా రాష్ట్రంలో రసాయినిక ఎరువుల వాడకం తగ్గుముఖం పడుతోందన్నారు. రసాయినిక ఎరువులతో సాగు చేస్తున్న మాదిరిగానే సేంద్రీయ వ్యవసాయంలోనూ దిగుబడులు వస్తున్నాయన్నారు. సేంద్రీయ వ్యవసాయంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయన్ని మరింత పెంచి, ఆర్గానిక్ క్లస్టర్ గా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.న్మభూమి కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థుల సేవలను జన్మభూమి సందర్భంగా చేపట్టే రోజువారీ కార్యక్రమాల్లో అంశాల వారీగా వినియోగించుకుంటామన్నారు. దీనివల్ల విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. రానున్న కాలంలో సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతో చెడు ఉన్నా మంచి ఎక్కువగా కలుగుతుందన్నారు.  అభివృద్ధి ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.రాజమండ్రిలో జరిగిన మౌజిం హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబునాయు తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానన్నారు. మృతుడు యూపీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారన్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ రాజమండ్రి వెళ్లిందని, మృతుని ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతిపై పర్యవేక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా…రాష్ట్రంలో అలజడి సృష్టించాలి అనే కోణమా? అన్నది పోలీసు దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'