బీజేపీ మీద విషం కక్కుతారా?

December 19
11:52 2017

హైదరాబాద్;గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో గెలుపు చరిత్రాత్మకం అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. గుజరాత్‌లో బీజేపీ డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసిందని, కుహనా మేధావులు, విశ్లేషకులు ఆ విజయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నిన్నటి దాకా మోదీని పొగిడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి విమర్శించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు బలుపు కాదు అని, వాపు అని వ్యాఖ్యానించారు. ఓట్లు పెరిగి సీట్లు తగ్గితే బీజేపీ మీద విషం కక్కుతారా? అని ప్రతిపక్షాలపై ప్రశ్నలు సంధించారు. రేపు, ఎల్లుండి బీజేపీ రూట్ మ్యాప్ తయారుచేస్తున్నామని, వివిధ స్థాయిల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు జరుగుతాయని చెప్పారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'