కోటను చూసి ఇవాంక ఫుల్ ఫిదా

November 29
19:25 2017

హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను సందర్శించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోటకు వచ్చిన ఆమె.. సుమారు 40 నిమిషాల పాటు కలియతిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇవాంక తిలకించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ఆమె వీక్షించారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే డిజిటల్ ప్రదర్శనను ఇవాంక తిలకించారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఇవాంక.. రాణిమహాల్‌ను కలియతిరిగారు. కోట సందర్శన అనంతరం ఇవాంక ట్రైడెంట్ హోటల్‌కు బయల్దేరి వెళ్లారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'