యాచకుల్లో గ్రీన్ కార్డ్ – ప్రొఫెసర్స్- డిగ్రీ హోల్డర్

December 22
11:44 2017

హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ యాచకుల్లో చిత్రవిచిత్రాలు నమోదవుతున్నాయి. కొద్దికాలం క్రితం నిర్వహించిన డ్రైవ్ లో అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ – ప్రొఫెసర్ గా పనిచేసిన వారు ఉన్న వార్త తెరమీదకు రావడం ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో మరో వార్త తెరమీదకు వచ్చింది. యాచకులను పట్టుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా ఇద్దరు ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తులు దొరిగారు. వీరికి అధికారులు రూ. 12000నెల వేతనం లభించే ఉద్యోగాలు కల్పించారు.కంప్యూటర్ సైన్స్ తో డిగ్రీ పూర్తిచేసిన ఎల్బీనగర్ కు చెందిన 33సంవత్సరాల వయస్సుగల సీహెచ్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి జైళ్లశాఖ నిర్వహిస్తున్న మై నేషన్ ఆయుర్వేద విలేజ్ లో నెలకు రూ. 12000వేతనంతో ఉద్యోగాన్ని జైళ్లశాఖ అధికారులు కల్పించారు.

అలాగే – చెన్నై అడయార్ ప్రాంతానికి చెందిన 31ఏళ్ల పి. రాజ్ కుమార్ అనే యాచకుడికి కూడా ఈ ఆయుర్వేద విలేజ్ లో రూ. రూ.12 వేల వేతనంతో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లలో పనిచేయడానికిగాను మానసికంగా – శారీరకంగా దృఢంగా ఉన్నవారికి శిక్షణను ఇస్తున్నట్లు వారుతెలిపారు.అధికారుల స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటివరకు 585మంది యాచకులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాదు శారీరకంగా దృఢంగా ఉన్నవారికి స్వయం ఉపాధి శిక్షణనిస్తున్నారు. ఈ యాచకుల్లో డిగ్రీ పూర్తిచేసిన ఇద్దరికి నెలకు రూ. 12000చొప్పున ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. గత ఐదు విడతలుగా చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా 585మంది యాచకులను వివిధ కూడళ్లు – ప్రార్థనా స్థలాల వద్ద నుంచి పట్టుకున్నారు.

డిసెంబర్ ఏడునుంచి 17వ తేదీవరకు నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 134మంది యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గుర్తించిన యాచకుల్లో వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా – వీరిలో అనేకమంది వారి వారి ఇళ్లకు వెల్లగా మిగిలినవారిలో చంచల్ గూడ – చర్లపల్లి జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాలకు తరలించారు.అక్టోబర్ 20నుంచి నవంబర్ 15వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో 222మంది యాచకులను గుర్తించి చంచంల్ గూడ – చెర్లపల్లిలోని అనాథాశ్రమాలకు తరలించారు. ఈ 222మంది యాచకుల్లో 24మంది మహిళలు – 138మంది పురుషులున్నారు.

తిరిగి డిసెంబర్ 7నుంచి 17వ తేదీవరకు నిర్వహించిన డ్రైవ్ లో 134మంది యాచకులను గుర్తించి వీరిలో 90మంది పురుషులను చర్లపల్లి పునరావాస కేంద్రానికి తరలించగా – మహిళా యాచకులను చంచల్ గూడ పునరావాస కేంద్రానికి తరలించారు. అంతేకాదు అక్కడ జైళ్లశాఖ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు – షెల్టర్ కల్పించడంతోపాటు కౌన్సిలింగ్ నిర్వహించి యాచకులు తిరిగి భిక్షాటన చేయకుండా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టుకున్నవారి వేలిముద్రలను సేకరించి మళ్లీ భిక్షాటన నిర్వహించకుండా హెచ్ఛరించి పంపిస్తున్నారు.  నగరాన్ని యాచకరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ ఎంసీ జైళ్లశాఖ – ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం విధితమే.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'