విద్యుత్ ఉత్పత్తిలో మనమే నెంబర్ 1

December 17
21:20 2017

హైదరాబాద్;విద్యుత్ ఉత్పాదనలో యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని,అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ రంగం మీద ఉన్న మక్కువే కారణమని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు లోను తెలంగాణ రాష్ట్రం అదేస్థాయిలో ఉండాలని ఆయన ఆకాక్షించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ నందించడమే కాకుండా,గృహ అవసరాలతో పాటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్రకెక్కిందన్నారు. ఈ నెల 14 నుండి 20 వరకు జరుగుతున్నా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్బంగా ఆదివారం రోజు ఉదయం ఆయన స్థానిక నెక్లేస్ రోడ్ లో ఎనర్జీ వాక్ ను ప్రారంభించారు.

అనంతరం విశ్వేశరయ్య భావం లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ విద్యుత్ ఆదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారని కొనియాడారు. తనకున్న 17 సంవత్సారాల పరిచయంలో ఆయన దగ్గర నేర్చుకుంది కూడా విద్యుత్ పొదుపు గురించెనని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొదటి సారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఆయనకు ఎదురైన మొదటి సమస్య విద్యుత్ ఱంగమీదనే కావడంతో దీనిమీద లోతుగా అధ్యయనం చేసిన మీదట అక్రమంగా విద్యుత్ ను వినియోగిస్తూ హీటర్లు పెట్టె వారిని గుర్తించి మీకు హీటర్లా …మోటార్లా అని రైతులను ఛైతన్యపరచడం నుండి మొదలైన ప్రస్థానం ఇప్పుడు 24 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చేవరకు చేరుకుందని ఆయన అన్నారు. యావత్ భారతదేశంలో ఇప్పటికి విద్యుత్ ను వినియోగించని గ్రామాలు కోకోల్లలుగా ఉన్నాయన్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ విద్యుత్ మంత్రుల సమావేశానికి హజరైనప్పుడు వచ్చిన చర్చలలో కొన్ని రాష్ట్రాలలో మారుమూల గ్రామాలకు ఇప్పటికి విద్యుత్ అందుబాటులో లేదని తెల్సి ఆశర్యపోయానంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

అయితే ఆ సమావేశంలో ఇప్పటివరకు దేశాన్ని ఏలిన అన్ని రాజకీయపార్టీలకు చెందిన వారు ఉండడం విశేషమన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడం తో పాటు అతి చిన్న రాష్ట్రం… అధికారంలోకి వచ్చింది కొత్త పార్టీ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే విద్యుత్ రంగంలో మనమే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. అసలు ఆ సమావేశం నిర్వహించిందే దేశంలోని మారు మూలా ప్రాంతాలకు విద్యుత్ నందించడం కోసమని,అందులో భాగంగా మన రాష్ట్రం వంతు వచ్చినప్పుడు మనము చెప్పిన విషయాలు విని మిగితా రాష్ట్రాల మంత్రులు ఆశర్యపోయారన్నారు. అందుకు కారణం కింది స్థాయిలో హెల్పర్ నుండి సి యం డి ల వరకు పడ్డ శ్రమ అని దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రోత్సాహం మరొకటి అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంశించారు. అంతటి అద్భుత ఫలితాలు సాధించిన మనమీద ఇప్పుడు విద్యుత్ ను అదా చేయడమన్న గురుతరబాధ్యత పడిందన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం అనేది జీవితంలో ఒక భాగం అయిందని,అయితే అదే సమయంలో విద్యుత్ దుబారాను ఎవరికీ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అరికట్టకలిగితే భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చినవారమౌతామని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంధన పొదుపు అనేది కేవలం ఒక్క  విద్యుత్ పొదుపు టోన్ సరిపోదని అన్నిరకాల ఇంధనాలను పొదుపు చెయ్య గలిగినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అందుతాయన్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్ల కుండా ప్రత్యామ్నాయ పద్దతులలో విద్యుత్ ఉత్పత్తి ఫై ఇప్పుడు ప్రపంచం దృష్టి సారించందని, దానిని అమలు పర్చడంలో యావత్ ప్రజానీకం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో ప్రత్యేకించి సోలార్ నుండి విద్యుత్ ఉత్పత్తికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే పర్యావరణాన్నీ కాపాడుగోగలిగిన వారమౌతామని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న విద్యుత్ ప్లాంట్ లను మూసి వేస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు బొగ్గుతో అదే పనిగా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుంటూ  పొతే భవిష్యత్ తరాలకు బొగ్గు నిల్వలు ఉండవని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. అదే సమయంలో రాష్ట్ర పునరుద్ధరణియ ఇంధన వనరుల సంస్థ చేపట్టిన ఎల్.ఇ.డి బల్బుల వాడకం కూడా ఇంధన పొదుపులో అంతర్భాగామని,ఇప్పటికే జి.హెచ్.యం.సి వీధిలైట్ల స్థానంలో ఎల్.ఇ.డి బల్బులను వినియాగంలోకి తెచ్చి విద్యుత్ అదాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్థుందన్నారు. అంతే  గాకుండా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగలందరి ఇండ్ల మీద సోలార్ పవర్ ప్లాంట్ అమర్చే విధంగా రాష్ట్ర పునరుద్ధరణియ ఇంధన వనరుల సంస్థ సిండికేట్ బ్యాన్క్ తో ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనియమన్నారు. దానికి తోడు 40 లక్షల ఎల్.ఈ.డి బల్బులను సబ్సిడీ మీద అందించడంతో పాటు 72 పురపాలక సంఘాలలో సంప్రదాయ విడి బల్బుల స్థానంలో 4.20 లక్షల ఎల్.ఇ.డి బల్బుల ను రేపుతూ చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అదే సమయం లో గ్రామపంచాయతీలతో పాటు నగర పంచాయితీలలో 16 లక్షల ఎల్.ఇ.డి బల్బులను రేపుతూ చేసేందుకు ఈ సంస్థ ఏరాప్టులు చేస్థుందాన్నారు. ఇప్పటికే ప్రయాగాత్మకంగా రెండు వేళా బల్బులను వివిధ గ్రామాలలో వాడుతుండగా ఆయా గ్రామాలలో విద్యుత్ పొదుపైన అధ్యయనం జరుగుతుందని ఆయన వెల్లడించారు.విద్యుత్ ను పొదుపు చెయ్యడంలో  రాష్ట్ర పునరుద్ధరణియ ఇంధన వనరుల సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ గా రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుందామన్నారు.
నగర మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ సేవింగ్ మీద చర్చ జరుగుతుందన్నారు. ఇంధన ఉత్పత్తి ఖర్చు భారీగా పెరుగుతున్నందున విద్యుత్ పొదుపు మీద దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ఇంధన పొదుపు ప్రాముఖ్యతను కింది స్థాయి వారాగాలు పోయే విధంగా చూడాలని ఆయన అధికారులను కోరారు. కొన్ని దేశాలు సహజ వనరులను భవిష్యత్ అవ్సరాలు దృష్ట్యా దాచుకుంటున్నాయనున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఎల్.ఇ.డి బల్బుల వాడకం ద్వారా ఇప్పటికే 40 మెగావాట్ల విద్యుత్ ను పొదుపు చేయగలిగామని దింతో నగర పాలకసంస్థకు కోటను కోట్ల ఆదాయం  మిగులుతుందన్నారు. ఈ సందర్బంగా సిండికేట్ బ్యాంకు తో రాష్ట్ర ఇంధన శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిష్రా  రాష్ట్ర పునరుద్ధరణియ ఇంధన వనరుల సంస్థ వి.సి &యం.డి సుధాకర్ రావు  లు సొంతంగా ఇండ్లు ఉండి యిండ్లమీద సోలార్ విద్యుత్ ను ఉట్పట్టి చేసుకునే యూడీగుల ఇండ్ల మీద సోలార్ ప్లాంట్ల పెట్టె విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా,టి.పి.సి.పి.డి.సి.ఎల్ సి.యం.డి రఘుమారెడ్డి,  రాష్ట్ర పునరుద్ధరణియ ఇంధన వనరుల సంస్థ వి.సి&యం.డి సుధాకర్ రావు,జెనెరల్ మేనేజర్ జి.ఎస్.వి ప్రసాద్ సిండికేట్ బ్యాంకు  మేనేజర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'