ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న జగన్

December 17
20:21 2017

విజయవాడ: జగన్ తన పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు  విమర్శించారు. ఆయన ఇస్తున్న హామీలు ఎప్పటికీ అమలు కావన్నారు. వైసీపీ అధినేత జగన్ ఇస్తున్న హామీలపై ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల  దృష్ట్యా.. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరంపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి గడ్కరీతో చర్చల తరువాత కాంట్రాక్టర్‌కు నెల గడువు ఇచ్చామన్నారు. నెలలోగా నిర్థేశించిన పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్‌ను మారుస్తామని చెప్పారు. పోలవరానికి నిధుల కొరత లేదని, కేంద్రం సహకారంతో గడువులోపు పూర్తిచేస్తామన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'