కళా తపస్వికి అరుదైన పురస్కారం

December 17
16:56 2017

‘శంకరాభరణం, స్వర్ణ కమలం, సాగర సంగమం’ లాంటి ఎన‍్నో కళాత్మక సినిమాలతో తెలుగు వెండితెరను సుసంపన్నం చేసిన సీనియర్ దర్శకులు కళాతపస్పి కె.విశ్వనాథ్ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-17)   విజయవాడ లో విశ్వనాథ్ ను ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.

రోటరీ క్లబ్‌ ప్లాటినమ్‌ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో  రోటరీ క్లబ్‌ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.సి.దాస్‌, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్‌ పులిపాక కృష్ణాజీ లతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్లో జరిగిన ఈ వేడుకలో కె.విశ్వనాథ్‌ సనిమాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శించారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'