కల్తీ నిరోధక చట్టానికి మరింత పదను

December 22
11:31 2017

హైదరాబాద్ :క‌ల్తీ నిరోధ‌క చ‌ట్టానికి మ‌రింత ప‌ద‌ను పెట్టాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణ‌యించిది. వ‌స్తువుల త‌యారీ నుంచి వినియోగ‌దారుడికి చేరే వ‌ర‌కు అన్ని స్థాయిల్లోనూ మ‌రింత ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి లక్ష్మారెడ్డి అధికారుల‌కు చెప్పారు. ఇందుకు నిపుణుల‌తో కూడిన ఒక అధ్య‌య‌న క‌మిటీని వేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో క‌ల్తీ దందా లేకుండా చేసేందుకు పోలీసు విభాగంతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని కూడా మంత్రి సూచించారు. వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆప్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ కార్యాల‌యంలో మంత్రి అధికారుల‌తో క‌ల్తీ నిరోధానికి సంబంధించి స‌మీక్షించారు.ఈ మ‌ధ్య క‌ల్తీ పెచ్చ‌రిల్లుతున్న‌ట్లుగా అనేక వార్త‌లు వెలువ‌డుతున్నాయ‌ని, అలాగే హైకోర్టు సైతం క‌ల్తీ మీద మాట్లాడిన అంశాల‌ను గుర్తు చేశారు. అయితే క‌ల్తీ నిరోధానికి ఇప్ప‌టికే తీసుకున్న చ‌ర్య‌ల‌ను సంబంధిత అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

క‌ల్తీ నిరోధ‌క చ‌ట్టం మ‌రింత ప‌ద‌నుగా ఉండాల‌ని, దాన్ని ప‌టిష్టం చేయ‌డానికి ఏం చేయాల‌న్న దాని మీద అధ్య‌య‌నం చేయ‌డానికి ఒక        క‌మిటీని నియ‌మించాల‌ని అదేశించారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు మొద‌లు మిగతా అన్ని వినియోగాల్లోనూ క‌ల్తీ లేదా రెండో ర‌కం వ‌స్తువులు చ‌లామ‌ణిలో ఉంటున్నాయ‌న్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌లకు ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌న్నారు. ప్ర‌జారోగ్యం సామాజిక స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించ‌కుండా ఉండాలంటే ప‌టిష్ట‌మైన చ‌ట్టాలు ఉండాల‌న్నారు.

క‌ల్తీ నిరోధానికి ఏమేం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చో కూడా ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయ‌మ‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్ర‌మం త‌ప్ప‌కుండా దాడులు నిర్వ‌హించ‌డం, షాంపిల్స్ తీసి, ప‌రీక్షించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అయితే ల్యాబ‌రేట‌రీ, క‌ల్తీ నిరోధ‌క విభాగంలో ఉన్న మాన‌వ వ‌న‌రుల కొర‌త‌ను అదిగ‌మించ‌డానికి అవ‌స‌ర‌మైన నియామ‌కాల కోసం వివ‌రాలు అందించాల‌ని ఆదేశించారు.కాగ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల హెల్త్ స్కీం ప‌రిధిలోని వైద్య సేవ‌ల మీద అపోహ‌లు వ‌ద్ద‌ని, ఆ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, ఎలాంటి ఆటంకాలు లేవ‌ని, అయితే, మిగిలి ఉన్న బ‌కాయీల‌ను కొద్ది రోజుల్లోనే క్లియ‌ర్ చేస్తామ‌ని అన్నారు.

ఏడాదిగా నిరాటంకంగా, ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల మ‌న్న‌న‌ల‌తో న‌డుస్తున్న హెల్త్ స్కీంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌న్నారు.సాంకేతిక, ప‌రిపాల‌నా ప‌ర‌మైన‌ కార‌ణాల వ‌ల్ల త‌లెత్తిన కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆ స్కీంలో వైద్యం చేసిన హాస్పిట‌ల్స్‌కి బిల్లుల బ‌కాయీలు మిగిలాయ‌న్నారు. అయితే వాటిని కొద్ది రోజుల్లోనే క్లియ‌ర్ చేస్తామ‌న్నారు. ఈ మ‌ధ్య ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టులు, పెన్ష‌న‌ర్ల వైద్య సేవ‌లు నిలిచిపోయాయ‌న‌డం స‌రికాద‌న్నారు. వైద్య సేవ‌లు ఎక్క‌డా నిలిచిపోలేద‌న్నారు. ఈ స్కీం కింద వైద్య సేవ‌ల‌కు ఎలాంటి ఆటంకాలు లేవ‌న్నారు.

 

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'