వివాహం ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు

December 30
12:22 2017

హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. వికలాంగుడైన అబ్బాయిని అమ్మాయి వివాహమాడినా.. లేక వికలాంగురాలైన అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్న ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు కల్యాణలక్ష్మి పథకం కూడా దివ్యాంగులకు వర్తిస్తుంది. ఉదాహరణకు దివ్యాంగులకు ఇచ్చే ప్రోత్సాహకం రూ. లక్ష అయితే.. కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చే రూ. 71వేలతో కలిపి మొత్తం రూ. లక్షా 71వేలు లబ్ధి పొందుతారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'