ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయాలు

December 15
08:18 2017

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో హోంగార్డులతో సమావేశమయ్యారు. జీతాల పెంపుతో పాటు అనేక నిర్ణయాలు ప్రకటించారు:

– నెలవారీ జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంపు
– ప్రతీ ఏడాది నెలకు వెయ్యి చొప్పున ఇంక్రిమెంటు
– హోంగార్డులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు
– కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా హెల్త్ ఇన్సూరెన్సు
– ట్రాఫిక్ లో పనిచేస్తున్న హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగానే 30 శాతం అదనపు వేతనం
– కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్
– మహిళలకు 6 నెలల మెటర్నటీ లీవులు
– పురుషులకు 15 రోజుల పెటర్నటీ లీవులు
– బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు
– అంత్యక్రియలకు ప్రస్తుతం ఇచ్చే ఐదు వేలను పదివేల రూపాయలకు పెంపు
– కానిస్టేబుళ్ల మాదిరిగానే పోలీస్ హాస్పిటల్స్ లో హోంగార్డులకు చికిత్స

కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్ పెంపు:
—————————————————-
– టి.ఎస్.ఎస్.పి: ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం
– ఎ.ఆర్: ప్రస్తుతం 5 శాతం – ఇకపై 15 శాతం
– సివిల్: ప్రస్తుతం 8 శాతం – ఇకపై 15 శాతం
– పిటిఓ (డ్రైవర్లు): ప్రస్తుతం 2 శాతం – ఇకపై 20 శాతం
– పిటిఓ (మెకానిక్స్): ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం
– ఎస్.పి.ఎఫ్: ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం
– ఫైర్: ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం
– ఎస్.ఎ.ఆర్.సి.పి.ఎల్: ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం
– పోలీస్ కమ్యూనికేషన్స్: ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం

ముఖ్యమంత్రికి డిజిపి కృతజ్ఞతలు:
————————————-
హోంగార్డుల జీతాలు పెంపడంతో పాటు, వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అత్యంత మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని డిజిపి చెప్పారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇదే క్రమంలో ఇప్పుడు హోంగార్డుల అపరిష్కృత సమస్యలెన్నో పరిష్కరించారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ద్విగుణీకృత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తారని మహేందర్ రెడ్డి అన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'