కేటీఆర్‌కు ఇవాంక ఆహ్వానం

November 30
15:25 2017

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఏడాది అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. పిబ్రవరి 12, 2018 న ఆయన తన బృందంతో హార్వర్డ్‌ యూనివర్సిటీ లో సందర్శనకు వెళ్లనున్నట్టు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్‌, అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్‌తో భేటీ అవుతారు. యూఎస్‌ వచ్చినప్పుడు తనను కలవాలని కేటీఆర్‌ను ఇవాంక  ఆహ్వానించారని జయేష్‌ రంజన్‌ వెల్లడించారు​. కాగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుపై ఇవాంక సంతోషం వ్యక్తం చేశారన్నారు. జీఈ సమ్మిట్‌ భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపర్చడానికి ఎంతో దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు

జీఇఎస్‌లో 300 మంది వెంచర్ కాపిటలిస్ట్ లు పాల్గొన్నారని, వారంతా హైదరాబాద్‌ తో పాటు ఇక్కడ కంపెనీల పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీంతో భవిష్యత్తులో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు వున్నాయన్నారు. రెండు రోజుల పాటు సాగిన ఇవాంక పర్యటనతో ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు మలచ గలిగామని.. ఇలాంటి అంతర్జాతీయ సదస్సును అర్థవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'