మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం

December 16
15:15 2017

హైదరాబాద్ : దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు.

రాబోయే 10-20 ఏండ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సర్కిళ్లను పెంచామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే సర్కిళ్లను పెంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిందని స్పష్టం చేశారు. నగరంలో 22 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికే కాకుండా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'