రైతు ఆదాయం రెట్టింపు

November 05
09:18 2017

వరల్డ్ ఫుడ్ ఇండియా – 2017లో రెండోరోజు పలుసంస్థలతో మంత్రి కేటీఆర్ సమక్షంలో రూ. 1250 కోట్ల విలువైన 9 అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సంతకాలు చేశారు. బికనీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీమేన్స్ ఫుడ్స్, కనోరియా గ్రూప్ కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బేకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూపు, క్రీం లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 3800 మందికి నేరుగా ఉద్యోగవకాశాలు, మరో 20వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలున్నాయి.

గత రెండు రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 10వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీంతోపాటు 45వేల మంది రైతులకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్పనున్నారు. వీటితోపాటు మరికొన్ని సంస్థలతో మంత్రి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రాజన్న, రాజశేఖర్‌రెడ్డి, అఖిల్‌గవార్ పాల్గొన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'