ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ

December 19
12:02 2017

కరీంనగర్:ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ… టెర్రరిస్టులకు రక్షణ కవచం అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ… ఎంఐఎం పార్టీ ముస్లిం మహిళలకు చేసిందేమీ లేదన్నారు. అలాగే సుప్రింకోర్టు గైడ్‌లెన్స్ ప్రకారమే త్రిబుల్ తలాక్‌పై పార్లమెంట్‌లో బిల్లు పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణాలో కాంగ్రెస్‌కు స్థానం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవలక్షణాలన్నీ టీఆర్ఎస్‌కి ఉన్నాయన్నారు.

అలాగే మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకి మేం వ్యతిరేకమని, తెలంగాణాలో మేమే ప్రత్యమ్నాయమని, తెలంగాణా రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం, దళితులపై దాడులు పెరిగాయని మురళీధర్ రావు పేర్కొన్నారు. వారసత్వ, కుల, మతతత్వ రాజకీయాలకు అంతం పలికేందుకు బీజేపీ నడుం బిగించిందని, త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా బీజేపీయే గెలుస్తుందన్నారు. కరీంనగర్‌: దేశంలో భాజపా సాధిస్తున్న వరుస విజయాలతో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయని భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో విజయం సాధించిన భాజపా తదుపరి లక్ష్యం కర్ణాటక అని స్పష్టం చేశారు. భాజపా బలపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

అభివృద్ధి, సుపరిపాలన అందించడమే భాజపా ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. వంశ పాలన, కులమత రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తాయని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఆయన విమర్శించారు. తెలంగాణలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా ఎప్పుడూ వ్యతిరేకమేనని మురళీధర్‌రావు స్పష్టం చేశారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'