మోదీ దిగజారి మాట్లాడారు

December 19
11:55 2017

హైదరాబాద్: గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దిగజారి మాట్లాడారని, తనను చంపేందుకు పాకిస్తాన్‌ వారికి సుఫారీ ఇచ్చారని స్వయంగా మోదీ ఆరోపించడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురంవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…  దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు సీపీఐ పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే ఒకేసారి ఎన్నికలని, ఎఫ్‌ఆర్‌డీఏ బిల్లుకు వామపక్షాలు వ్యతిరేకమని ఆయన అన్నారు. కాగా… ఆదివాసీలు-లంబాడీల సమస్యను జటిలం చేసింది ప్రభుత్వమేనని, ఇందులో కేసీఆర్ దోషి‌ కాగా పోలీసులను బలిచేయడం తగదని సురంవరం అన్నారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'