రేవంత్‌ స్కెచ్‌.. కాంగ్రెస్‌లో కాక

October 20
18:03 2017

 

హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత రేవంత్‌ రెడ్డి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ రాకను కొందరు నేతలు బాహాటంగానే స్వాగతిస్తున్నా.. మెజారిటీ టీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. నిశితంగా పరిణామాలను గమనిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు సాగిస్తున్న రేవంత్‌ అదే సమయంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలను ఆయన కలిసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తన రాకను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై రేవంత్‌ ఫోకస్‌ చేసినట్టు వినిపిస్తోంది.

మరోవైపు తన వెంట భారీగా టీ టీడీపీ నేతలను కాంగ్రెస్‌ గూటికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీలోని ఎక్కువమంది నేతలను సమీకరించేందుకు ఆయన స్కెచ్‌ వేసినట్టు సమాచారం. తన అనుకూల నేతలు, సన్నిహితులతో రేవంత్‌ నిత్యం మంతనాలు జరుపుతూ.. తన వెంట కలిసిరావాల్సిందిగా కోరుతున్నారని సమాచారం.  కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి రావాలని, తన వెంట నడువాలని రేవంత్‌ సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'