వెయ్యేల్లకు పూర్వమే తెలంగాణ చరిత్ర

December 20
12:15 2017

 

తెలంగాణ చరిత్ర వెయ్యేల్లకు పూర్వం నుండే ప్రారంభం అయిందని చోళులు,కతీయుల కాలంలోని తెలంగాణ చరిత్ర కు పునాదులు ఎర్పడాయని  ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలియచేసారు. మంగళవారం నాడు ప్రపంచ తెలుగు మహా సభల్లో భాగంగానిర్వహిస్తున్న   కార్యక్రమాల్లో రవీంద్ర భారతి లో “ తెలంగాణ చరిత్ర”  ఇష్టా గోష్టి సదస్సును ఆయన ప్రారంభించారు. తెలుగు భాష అన్ని భాష లకన్నా సులువైన భాష అన్నారు. ఎవరైనా సులువు గా నేర్చుకోవచ్చని అన్నారు.

తెలంగాణ కు బంగారు చరిత్ర రూపుదిదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.  అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో  ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగును తప్పక బోధించాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదేశాలు జారి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ తెలియచేశారు.సదస్సుకు అధ్యక్షత వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్థానిక భాషకు, సాహిత్యానికి సభలు చరిత్రకు మేళవింపు అన్నారు. తెలుగు మహా సభల్లో చరిత్రను అంశంగా చేర్చడం ఎంతో అభినందనీయం అని అన్నారు. చరిత్ర కారులు, సాహితీ వేత్తలు , పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు వక్తలతో వేదిక నిండుగా ఉందని  అన్నారు. తెలంగాణ చరిత్ర పునఃనిర్మించే క్రమంలో చక్కటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని  చెపుతూ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను ప్రశంసించారు.అసఫ్ జహీల ఆధునీకరణ గురించి  ఆచార్య అడపా సత్యనారాయణ వివరిస్తూ హిందు, ఇస్లాం, సూఫీ లు మిశ్రమ సంస్కృతి మూలాలని అన్నారు. ఏడవ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గొప్ప చరిత్ర సంరక్షకుడని అన్నారు.

1884 లో ఉర్దూ అధికార భాష అయిందని చెపుతూ భాగ్య రెడ్డి వర్మ వినతుల వల్ల అనేక  పాఠశాలలో  తెలుగు భాష ను నిజాం అమల్లోకి తెచ్చారని ఆయన తెలిపారు. చరిత్రను నూతన దృక్పదంతో విశ్లేషించి పునర్నిర్మాణనికి పూనుకోవాల్సిన అవసరం ఉందని  ఆయన తెలిపారు.    కుర్రా జితేంద్ర బాబు ఆధునిక చరిత్ర గురించి వివరిస్తూ శాసన పరం గా, చరిత్ర పరం గా అధ్యయనం చేసి పరిగణనలోకి తీసుకున్నపుడు భాష అభివృధి చెందుతుందని అని అన్నారు. ప్రాచ్య చరిత్ర – ఆధునిక చరిత్ర తీరు తెన్నులను ఆయన వివరించారు.  నాణాల పరిశోధకుడు డా. పి. రాజ రెడ్డి తెలంగాణ లో లభించిన నాణాల విశిష్టత గురుంచి  చెపుతూ చోళులు, కాకతీయుల కాలం నాటి సుమారు ఐదు లక్షల నాణాలు స్టేట్ మ్యూజియం లో ఉన్నట్లు తెలిపారు.  తెలంగాణ చరిత్ర నిర్మాణానికి నాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

డా. ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సంస్థానాల  గురించి వివరిస్తూ లిపి  అనే పదం లేపనం అనే పదం నుంచి వచ్చినదని రంగుల బొమ్మల ఆధారంగా వర్ణమాల రూపు దిద్దుకుందని తద్వారా అక్షరాలూ వచ్చాయని తెలిపారు. గౌరవ అతిధి గా పాల్గొన్న. ఈమని శివనాగి రెడ్డి శాసనాలకి సంబంధించిన అంశాలను వాటికి ఆధారంగా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చరిత్ర రూపొంధించాల్సిన అవసరం ఉందన్నారు. బౌద్ధ పరిశోధకుడు మల్లె పల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ  బౌద్దం  గురించి వివరించారు.  సదస్సులో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి, సినీ కథా రచయిత తనికెళ్ళ భరణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వావిలాల భూపతి రాజు రచించిన ప్రత్యేక సంచిక “ తెలంగాణ సంస్కృతి – జీవన విధానం” అలాగే వావిలాల కోటేశ్వర్ రావు స్వీయచరిత్ర ప్రచురణను ఉప ముఖ్యమంత్రి. మహమూద్ అలీ ఆవిష్కరించారు.

 

 

 

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'