ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహా సభలు

December 19
12:25 2017

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎల్బీస్టేడియంలోని పాల్కూరికి సోమనాథుని ప్రాంగణం బమ్మెర పోతన వేదిక మీద ముగింపు వేడుకల ఈ క్రమంలో మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో పండితులు ఘనస్వాగతం పలికారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

తెలుగు ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భాషాభిమానులను అలరించాయి. నగరంలో ఎక్కడా చూసినా ఈ ఐదు రోజుల పాటు తెలుగు పండుగ వాతావరణం కొనసాగింది. ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి సహా వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అవధానాలు, సాహితీ సదస్సులు, చర్చాగోష్ఠిలు ఆకట్టుకున్నాయి. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు  తెలంగాణలో ముఖ్యమైన పిండి వంటలు,రుచికరమైన భోజన ఏర్పాట్లు, పండ్లు, ఫలాలు, తాంబూలం భోజన సమయంలో కవులకు విదేశీ వారికి, కళాకారులకు,సిబ్బందికి,మీడియా వాళ్ళకు, అధికారులకు అందరికి ఒకే రీతిలో అద్భుతంగా  వడ్డించారు. విదితమే మహాసభ ప్రారంభ వేడుకలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం.

 

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'