అమ్మ ఒడే మొదటి బడి

December 15
20:26 2017

హైదరాబాద్: ఎంత గొప్పవారికైనా అమ్మ ఒడే మొదటి బడని సీఎం కేసీఆర్ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు హాజరయ్యారని తెలిపారు.

దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, తెలుగు భాష అభిమానులు, తెలంగాణ ముద్దు బిడ్డలకు సీఎం కేసీఆర్ వందనం తెలియజేశారు. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని ముఖ్యమంత్రి కొనియాడారు. తల్లి జోల పాటతోనే బిడ్డకు సాహిత్యాన్ని అలవాటు చేస్తుందని తెలిపారు.

చిన్నతనంలోనే తన అమ్మ, నాన్న ఎన్నో పద్యాలు నేర్పినట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తల్లిదండ్రులే మనకు తొలి గురువులన్నారు. అమ్మ భాషను అమితంగా ప్రేమించే మాన్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని సీఎం కొనియాడారు. తన చిన్నతనంలో గురువులు శతకపద్యాల ద్వారా నీతి బోధించేవాళ్లను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు భాషా వికాసం, పరిరక్షణకు అందరం సంకల్పం తీసుకోవాలన్నారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'