తెలుగును విశ్వభాషగా చేయడానికి అందరూ కృషి చేయాలి

December 18
05:35 2017

హైదరాబాద్;తెలుగును విశ్వభాషగా చేయదానికి అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర శాసన సభాపతి మధుసూధనా చారితెలిపారు.సోమవారం తెలుగు విశ్వవిధ్యాలయమం లో నిర్వహించిన “తెలంగాణలో సాహితీ విమర్ష-పరిశోధన” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,రాష్ట్ర రాజధానిలో 6 వేదికల్లో నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమాలు ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయన్నారు.వందకు పై చిలుకుదేశాలలోనితెలుగువారుఆసక్తిగాగమనిస్తున్నారన్నారు.అభిమానిస్తున్నారు,ఆనందిస్తున్నారు,అభినందిస్తున్నారని,ఇదంతా ముఖ్యమంత్రి సారధ్యం లో తెలుగు ప్రజలందరికి,తెలుగు భాషకు,కవులకు,సాహితీ వేత్తలకు పట్టం కట్టి తెలుగు భాష గురించి సాహిత్యం,చరిత్ర గురించి  ప్రపంచ ప్రజలకి తెలియజేయడమేనన్నారు.తెలంగాణా లో లోతైన పరిశోధన ద్వారా ఇప్పటికి వెలుగులోకి వచ్చిన,వస్తున్న శాసనాలు తెలుపుతున్న ఆధారాలను బట్టి మనవద్దే ముందుగా గొప్ప సాహిత్య శోధన జరిగిందని తెలుస్తుందన్నారు

.కంద పద్యం తెలుగులోనే మొదటగా వచ్చిందని విషయం మరింద పరిశోధన జరగాల్సి ఉందన్నారు. తెలుగు భాషలందు తెలుగు గొప్పే కాకుండ తెలుగు మాధుర్యం,తియ్యదనం అందరూ అంగీకరించేదేనన్నారు.అంతేకాక బతుకమ్మ లాంటి పండగ తెలంగాణకు,ప్రపంచానికి ఒక గొప్ప సమ్మేళనమని ఇది ఎక్కడా లేనిదని తెలిపారు.అంతేకాదు తెలుగు వారు  మంచికి సహాయపడతారని,దిక్కారాన్ని సహించరని పేర్కొన్నారు.అనంతరం సభావేదిక మీద ఆహ్వానితులకు సన్మానం చేసి జ్నాపికలను అందజేసారు.వనపట్ల సుబ్బైయ్య, గుడిపల్లి నిరంజన్,బండ్ల ఐలయ్య,పెరుమాళ్ళ రాజారత్నం పుస్తకాలను ఆవిష్కరించారు. 

అంతకు ముందు తెలంగాణాలో సాహిత్య విమర్ష-పరిశోధనపై జి.లక్ష్మి నర్సయ్య,కపిలవాయి లింగమూర్తి, s.v.రాములు,లక్ష్మణ చక్రవర్తి,బాలశ్రీనివాసాచారి,కిషన్రావు,ఐలయ్య,ప్రవీన్కుమార్,C.M. రాజేశ్వరరావు,మృణాళినిలు చర్చలో పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించారు.తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిద్దారెడ్డి,కథలు,సాహిత్యకారులు,తదితరులు పాల్గొన్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'