నేటి నుంచి ప్రపంచ తెలుగు వైభవం

December 15
08:43 2017

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ప్రపంచ తెలుగుమహాసభలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఈ మహాసభలను ప్రారంభిస్తారు. తెలుగు భాష సాహిత్యాలపై ఒక దార్శనికతతో ప్రపంచ మహాసభలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు విశిష్ట అతిథులుగా ఈ ప్రారంభ వేడుకలలో పాల్గొంటారు. ప్రధాన వేదికైన లాల్‌బహదుర్ స్టేడియంతోపాటు ప్రధాన వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎల్బీ స్టేడియంతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంవూదభారతి, ఇందిరావూపియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ సారస్వత పరిషత్‌లన్నీ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేవిధంగా అలంకరించారు. ఈ సభల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొన్నారు. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపైన వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవ కార్యక్షికమం అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన డా.రాధా రాజాడ్డి ‘మన తెలంగాణ’ నృత్యరూపకం ప్రారంభసభలకు హైలైట్‌గా నిలువనున్నది. అనంతరం రామాచారి బృందం పాటలకచేరి ఉంటుంది. జయ జయోస్తు సంగీత నృత్యరూపకాన్ని కళాకృష్ణ బృందం ప్రదర్శిస్తున్నది. తెలుగుభాషలో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి అందుకున్న సాహితీ దిగ్గజాలు నగరానికి చేరుకున్నారు. ఒరియా, సంస్కృతం భాషలలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న సాహితీ వేత్తలు అతిథులుగా విచ్చేస్తున్నారు.

తెలుగు అకాడమీ, తెలంగాణ రాష్ట్ర సాహిత్యఅకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్‌లతో పాటు సాహితీ వేత్తలు కలిసి మొత్తం ఈ ఐదు రోజులలో అనేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. తెలుగు అకాడమీ 60 పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, భాగ్యడ్డివర్మ, వంటి మహామహుల మోనోక్షిగాఫ్‌లను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ 25 పుస్తకాలను ప్రచురించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాల ప్రకారం వాగ్భూషణమ్ భూషణమ్, మందార మకరందాలు పుస్తకాలను కిట్‌లలో భాగంగా అందజేస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'