తెలుగు భాష ను సుసంపన్నం చెసుకోవాలి

December 19
12:28 2017

హైదరాబాద్;తెలుగు భాష ను మనం సుసంపన్నం చెసుకొవలసిఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు జి. జగదీష్  రెడ్డి తెలిపారు. మంగళవారం తెలుగు యూనివర్సిటీ లోని సామల సదాశివ వేదికలో ఏర్పాటు చేసిన “తెలంగాణలో తెలుగు – భాష సదస్సు” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తల్లి భాషనూ బతికించుకోవడానికి ముందుగా మన ఇండ్లలో వారసత్వంగా వచ్చిన భాషనూ ముందు తరం వారికి అందించవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణలో చాల భాషలతో పాటు మన భాష కూడా నిరాదరణకు గురైందన్నారు. అయితే ఈ ప్రపంచాన్ని ప్రతిఘటించే ఉద్యమం కూడా జరుగుతుందన్నారు.

తెలుగు భాష నిరాదరణకు గురవుతున్నందుకు తాను ఆందోళన చెందుతున్నానని, అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలు తెలుగు భాష కు మరింత ప్రోత్సాహం, ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదన్నారు. భాష, యాస పై ఉద్యమంలో కూడా ప్రస్తావించామని గుర్తు చేసారు. అయితే ఒక భాషపై ఇంకో భాష ఆధిపత్యం చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. అందుకే ముందుగా మన భాష మనమే అభిమానించి, ఆధరించినప్పుడే ఇంకొకరు మన వెంట నడుస్తారని, ఆ విధంగా ప్రతి తెలుగు  వారు గుర్తుంచుకోవలన్నారు.అంతకుముందు ఈ అంశం పై పలువురు సాహితివేత్తలు తమ అభిప్రాయాలను వివరించారు. ఆచార్య యస్. లక్ష్మణ మూర్తి అద్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆచార్య ఆర్. వి. యస్. సుందర మూర్తి అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ కవి, పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నారెడ్డి  ని ఈ సందర్భంగా సన్మానించారు.

డా. కె. ముత్యం – తెలంగాణ తెలుగు – భాష వైశిష్ట్యం పై, మాస్టార్జి – శ్రామిక గేయాలు – భాష సౌందర్యం, బండారు సుజాత శేఖర్ – బతుకమ్మ, హోలీ, స్రీలపాటలు – భాష పై, రామోజీ ఫౌండేషన్ ప్రతినిధి జాస్తి విష్ణు చైతన్య, భాష పత్రికలూ – నిఘంటు నిర్మాణం, సమాల రమేష్ బాబు – భాష వర్తమాన స్తితి వారి ప్రసంగాలు వినిపించగా గీత రాణి సమావేశ కర్తగా వ్యవరించారు. అనంతరం పలువురు కవులు రాసిన పుస్తకాలను, సి.డి.లను ఆవిష్కరించారు. రాష్ట్ర  స్థాయిల్లో నిర్వహించిన పోటిలలో గెలుపొందినవారికి బహుమతులు అందచేసారు

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'