ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పది

December 19
12:20 2017

హైదరాబాద్: ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కోవింద్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జ‌రుగుతోన్న‌ ముగింపు వేడుక‌లకు వ‌చ్చిన రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ… దేశంలో అత్య‌ధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒక‌ట‌ని అన్నారు..తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని రాష్ట్రపతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు.

తన కంటే ముందు ముగ్గురు తెలుగువారు రాష్ర్టపతులయ్యారు. తెలుగు తెలిసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి, వివిగిరి, సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు వారి త్యాగాలు మరువలేనివి అన్నారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచిత పోరాటం చేశారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు’’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగం ముగించారు. తెలుగు సాహిత్యంలో కేసీఆర్‌కు మంచి పట్టు ఉందన్నారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రాష్ట్రపతి పేర్కొన్నారు.ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను ప్రారంభించిన ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడికి అభినంద‌ల‌ని వ్యాఖ్యానించారు.

ప్రపంచం నలుమూలలా తెలుగువారు ఖ్యాతి పొందారన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లకు తప్పకుండా తెలుగు నేర్పించండి సూచించారుపిల్లల పుట్టిన రోజునాడు ఒక మంచి తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని సూచించారు. తెలుగు భాషను కాపాడే ప్రయత్నంలో భాగస్వాములు కావాలన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగాముగుసాయి. వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎల్బీస్టేడియంలోని పాల్కూరికి సోమనాథుని ప్రాంగణం బమ్మెర పోతన వేదిక మీద ముగింపు వేడుకల ఈ క్రమంలో మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో పండితులు ఘనస్వాగతం పలికారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగు ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భాషాభిమానులను అలరించాయి. నగరంలో ఎక్కడా చూసినా ఈ ఐదు రోజుల పాటు తెలుగు పండుగ వాతావరణం కొనసాగింది. ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి సహా వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అవధానాలు, సాహితీ సదస్సులు, చర్చాగోష్ఠిలు ఆకట్టుకున్నాయి. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు  తెలంగాణలో ముఖ్యమైన పిండి వంటలు,రుచికరమైన భోజన ఏర్పాట్లు, పండ్లు, ఫలాలు, తాంబూలం భోజన సమయంలో కవులకు విదేశీ వారికి, కళాకారులకు,సిబ్బందికి,మీడియా వాళ్ళకు, అధికారులకు అందరికి ఒకే రీతిలో అద్భుతంగా  వడ్డించారు. విదితమే మహాసభ ప్రారంభ వేడుకలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'